HomeTelugu Reviews'ఏజెంట్' మూవీ రివ్యూ

‘ఏజెంట్’ మూవీ రివ్యూ

Agent Movie Review Fails to Impress

అక్కినేని యంగ్‌ హీరో అఖిల్‌ నటించిన తాజా పక్కా యాక్షన్ మూవీ ‘ఏజెంట్‌’. ఈ సినిమా కోసం అఖిల్ చాలానే కష్టపడ్డాడు. సిక్స్ ప్యాక్‌ చేసి బీస్ట్ లుక్‌లోకి మారాడు. సురేందర్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా పూర్తయ్యే వరకు తను మరో సినిమా కూడా ఒప్పుకోలేదు. దానికి తగ్గట్టు ఏజెంట్ సినిమా టీజర్, ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచాయి. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది? అఖిల్‌ని యాక్షన్ హీరోగా నిలబెట్టిందా లేదా? అనేది రివ్యూలో చూద్దాం…

మహదేవ్ (మమ్ముట్టి) రీసెర్చ్ అనాలిసిస్ రా హెడ్‌గా పనిచేస్తుంటాడు. దేశ భద్రత కోసం ప్రాణాలను సైతం త్యాగం చేయాలని ఎప్పుడూ చెబుతుంటాడు. దేశ రక్షణ కోసం ఏజెంట్స్‌ను చనిపోవాలని కూడా చెబుతుంటాడు. అలాంటి వ్యక్తికి పెద్ద సమస్యగా మారుతాడు గాడ్(డినో మోరియా). ఇండియాను నాశనం చేయటానికి తను సూపర్ ప్లాన్ ఒకటి తయారు చేస్తాడు. దాన్ని విదేశీయలకు అమ్మేయాలనేది తన ప్లాన్. గాడ్‌ను పట్టుకోవటానికి మహదేవ్ తన ఏజెంట్స్‌తో గట్టి ప్రయత్నాలే చేస్తుంటాడు. కానీ గాడ్ చిక్కినట్లే చిక్కి తప్పించుకుంటుంటాడు.

మరో వైపు రామకృష్ణ అలియాస్ రెక్కి (అఖిల్ అక్కినేని)కు రా వింగ్‌లో పని చేయాలనే బలమైన కోరిక ఉంటుంది. రెక్కి చాలా టాలెంటెండ్ కానీ.. ప్రొఫెషనల్‌గా లేకపోవటం, ఓవర్ యాక్టివ్‌గా ఉండటం వంటి కారణాలతో ‘రా’ అధికారులు అతన్ని మూడు సార్లు ఇంటర్వ్యూల్లో రిజెక్ట్ చేస్తారు. మహదేవ్‌ను అమితంగా ప్రేమించే రెక్కి.. తనకు దగ్గర కావటానికి ఏకంగా రా టెక్నాలజీని హ్యక్ చేస్తాడు. కానీ ప్రొఫెషనల్‌గా లేవని, నీలాంటి వాడు రా లో పని చేయలేడని చెప్పి అతన్ని దూరం పెడుతుంటాడు. కానీ ఓ సందర్భంలో రెక్కికి మహాదేవ్ గాడ్‌ను పట్టుకునే ఆపరేషన్ అప్పగిస్తాడు. అప్పుడు రెక్కి ఏం చేస్తాడు? మహదేవ్ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాడా? గాడ్‌ను పట్టుకుంటాడా? ఈ ఆపరేషన్‌లో ఇటు మహదేవ్, అటు రెక్కి మానసికంగా ఎదుర్కొనే పరిస్థితులేంటి? రెక్కి ప్రేమించిన అమ్మాయి (సాక్షి వైద్య)ను ఎందుకు వదులుకుంటాడు? అనే విషయాలు తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.

అఖిల్ మాస్, యాక్షన్ హీరోగా నిలదొక్కుకునేందుకు చాలా రోజులు గా ప్రయత్నాలు చేస్తున్నాడు. స్పై థ్రిల్లర్ కావటంతో యాక్షన్ ఎపిసోడ్స్‌ను భారీగానే ప్లాన్ చేశారు. మన దేశంతో పాటు విదేశాల్లోనూ ప్లాన్ చేసి తెరకెక్కించారు. నటీనటుల విషయానికి వస్తే.. అక్కినేని అఖిల్ పడ్డ కష్టంమామూలుగా లేదు. యాక్షన్ సన్నివేశాల కోసం తన లుక్ మొత్తాన్ని మార్చుకున్నాడు. సిక్స్ ప్యాక్స్‌తో ఫ్యాన్స్‌కే కాదు.. ప్రేక్షకులను సైతం ఆకట్టుకున్నాడు. తను హీరోగా చేయాల్సిన దాని కంటే ఎక్కువగా హార్డ్ వర్క్ చేశారనేది తెరపై చూస్తే తెలుస్తుంది. హీరోయిన్ సాక్షి వైద్య రోల్‌కి పెద్దగా ఆస్కారం లేదు. పాటలకే పరిమితం అయ్యింది. ఇక సినిమాలో మరో ప్రధాన పాత్ర మమ్ముట్టి పాత్రకు మంచి స్కోప్ ఉంది. రా హెడ్‌గా దేశం ప్రాణ త్యాగం చేసే దేశ భక్తుడిగా ఆయన పాత్రను చూపించారు. ఆయన తనదైన నటనతో మెప్పించాడు. డినో మోరియా చేసిన గాడ్ అనే విలన్‌ పాత్రకు ఇచ్చిన ఎలివేషన్‌కి రాను రాను ఆ పాత్రను చూపించిన తీరుకి అస్సలు సంబంధమే కనపడదు. పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ, వరలక్ష్మి శరత్ కుమార్, భరత్ రెడ్డి పాత్రలు అలా వచ్చి వెళ్లిపోతుంటాయి. భారీ క్యాస్ట్‌నే వాడారు. మూడు నాలుగు పాత్రలకు మినహా మిగిలిన వాటిని స్కోప్ కనపడదు.

దర్శకుడు సురేందర్ పేరుకు తగ్గట్టు సినిమాను స్టైలిష్‌గా తెరకెక్కించాడు. దానికి తగ్గటు బడ్జెట్ కూడా భారీగానే పెట్టారు. కానీ ప్రధాన సమస్య కథ, కథనం. సినిమా ఎక్కడో స్టారట్ అయ్యి.. ఎలాగో వెళుతుంటుంది. యాక్షన్ మరి ఎక్కువైంది. కానీ ఆ సన్నివేశాలు బోరింగ్‌గా అనిపిస్తాయి. స్పై థ్రిల్లర్ అన్నప్పుడు సీరియస్ మోడ్‌లో వెళుతూనే దేశభక్తిని ఎమోషనల్‌గా కనెక్ట్ చేసేలా ఉండాలి. కానీ ఈ సినిమాలో అదే మిస్ అయ్యింది. హిప్ హాప్ తమిళ అందించిన పాటలు, నేపథ్య సంగీతం పర్వలేదు.

టైటిల్‌ :’ఏజెంట్’
నటీనటులు: అక్కినేని అఖిల్,  సాక్షి వైద్య , మమ్ముట్టి, డినో మోరియా, సంపత్, వరలక్ష్మి శరత్ కుమార్, మురళీ శర్మ, పోసాని కృష్ణమురళి తదితరులు
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
నిర్మాత: అనిల్ సుంకర

చివరిగా: మిస్ ఫైరైన ‘ఏజెంట్‌’

సాయి ధరమ్ తేజ్ విరుపాక్ష మూవీ ట్రైలర్‌: భయం కలిగించే చాలా సన్నివేశాలు

ఆసక్తికరంగా ‘రంగమార్తాండ’ ట్రైలర్‌

దసరా ట్రైలర్: కత్తుల సాముతో ట్రైలర్ అంతా రక్తంతో పులుముకుంది

బట్టలు లేకుండా హట్‌ లుక్‌లో విద్యాబాలన్‌

రావణాసుర టీజర్‌: రవితేజ హీరో నా.. విలన్‌నా!

హీరోయిన్ శ్రద్ధా దాస్ ఎక్స్ పోజింగ్ విషయంలో అసలు ఎక్కడ తగ్గేదే లేదు

శిల్పా శెట్టి రోజుకో డ్రెస్సుతో ఫోటో షూట్, ముప్పై ఏళ్లుగా అవే అందాలు

Follow Us on FACEBOOK   TWITTER

Recent Articles English

Gallery

Recent Articles Telugu