
Salman Khan – Rashmika Mandanna Age Gap:
బాలీవుడ్ లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే, సల్మాన్ ఖాన్ (59) – రష్మిక మందన్నా (28) జంటగా నటిస్తున్న సికందర్ మూవీ. వీళ్లిద్దరి వయస్సులో 30 ఏళ్ల తేడా ఉండటంతో, ప్రేక్షకుల్లో ఇది పెద్ద చర్చకు దారి తీసింది. ట్రెండింగ్ వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు అన్నీ ఇదే టాపిక్ చుట్టూ తిరుగుతున్నాయి.
రష్మిక మొదటిసారి బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ తో సికందర్ లో జతకడుతోంది. ఈ సినిమా అర్ మురుగదాస్ డైరెక్షన్ లో వస్తోంది. అయితే, టీజర్ చూసిన తర్వాత కొంతమంది వీరి జంట ఫిట్ కాదు అని కామెంట్లు చేస్తున్నారు. “ఫాదర్-డాటర్ లా ఉన్నారు” అని ట్రోలింగ్ కూడా జరుగుతోంది.
బాలీవుడ్ లో వయస్సు తేడా – ఇది కొత్తేమీ కాదు. సల్మాన్ ఖాన్ గతంలో కూడా తనకంటే చిన్న వయస్సు గల హీరోయిన్స్ తో పనిచేశారు:
వాంటెడ్ (2009) – ఆయేషా టాకియా (21 ఏళ్ల తేడా)
దబాంగ్ (2010) – సోనాక్షి సిన్హా (22 ఏళ్ల తేడా)
దక్షిణాది చిత్ర పరిశ్రమలోనూ ఇదే పరిస్థితి ఉంది. రవి తేజ లాంటి సీనియర్ హీరోలు శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే లాంటి యంగ్ హీరోయిన్స్ తో నటిస్తున్నారు. అయితే, మంచి కథ, బలమైన స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటే ఈ వయస్సు తేడా పెద్దగా కనిపించదు.
ఈ వివాదం అటు పక్కన పెడితే, సికందర్ కథ, మేకింగ్ బాగుంటే హిట్ అవ్వడం ఖాయం. మురుగదాస్ స్టోరీటెల్లింగ్, సల్మాన్ మాస్ అప్పీల్ కలిసి రష్మిక క్యారెక్టర్ ని ప్రేక్షకులకు కనెక్ట్ చేస్తే, ఈ వయస్సు తేడా సమస్యే కాకపోవచ్చు.
ALSO READ: ఇండస్ట్రీ లో Top 10 Highest Paid South Indian Actresses జాబితా ఇదే