HomeTelugu Big StoriesRashmika Mandanna: విజయశాంతి తర్వాత ఆ ఘనత ఈమెకే దక్కింది

Rashmika Mandanna: విజయశాంతి తర్వాత ఆ ఘనత ఈమెకే దక్కింది

Rashmika Mandanna

Rashmika Mandanna Upcoming Movies:

Rashmika Mandanna ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్స్‌లో ఒకరు, కానీ బాలీవుడ్‌లో ఆమెకు ఇంకా సరైన గుర్తింపు రాలేదు. బాలీవుడ్‌లో తన స్థానం నిలబెట్టుకోవడానికి రష్మికా ఇప్పుడు తన రెండు సినిమాలతో స్టార్ లీగ్‌లో చేరేందుకు సిద్ధంగా ఉంది. ఆసక్తికరంగా, ఈ రెండు సినిమాలు కూడా డిసెంబర్ 6న విడుదల కానున్నాయి.

రష్మికా గుడ్ బై సినిమాతో హిందీ లో అడుగు పెట్టింది కానీ ఆ సినిమా విఫలమవ్వడంతో ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. తాజాగా చత్రపతి శివాజీ జీవిత కథ ఆధారంగా చవా అనే హిందీ సినిమాలో ఆమె ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రం డిసెంబర్ 6న విడుదల కానుంది. అదే రోజున, అల్లు అర్జున్ నటించిన పుష్ప 2: ది రూల్ కూడా విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే.

చవా లో Rashmika Mandanna కి నటనకి స్కోప్ ఉన్న పాత్ర దక్కింది. విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మీద ఆమెకి భారీ అంచనాలు ఉన్నాయి. మరోవైపు అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోతో చేస్తున్న పుష్ప పార్ట్ 2 కూడా ఈ నెలలో విడుదల కానీ ఇప్పుడు డిసెంబర్‌కు వాయిదా పడింది. ఈ రెండు సినిమాలూ డిసెంబర్ 6న విడుదల అవుతుండటంతో, సినిమాల మధ్య పోటీ కూడా ఎక్కువగానే ఉంటుంది.

ఇంతకుముందు బాలకృష్ణ, నాని వంటి ప్రముఖ హీరోలు, హీరోయిన్స్ లో విజయశాంతి వంటి సీనియర్ హీరోయిన్స్ ఇలా ఒకే రోజున రెండు సినిమాలు విడుదల చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు రష్మికా కూడా అలాంటి తరహాలో తన రెండు సినిమాలను ఒకే రోజు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం ఆసక్తికరంగా మారింది. ఈ తేదీ రష్మికాకి ప్రత్యేకంగా నిలుస్తుంది అని చెప్పుకోవచ్చు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu