భారత్ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదుల్లో ఒకరిపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఎనలేని గౌరవం చూపించారా? సోమవారం కాంగ్రెస్ అధ్యక్షుడు అన్న మాటలపై ఎదురుదాడికి దిగిన బీజేపీ ఇదే ఆరోపణ చేస్తోంది. కాంగ్రెస్ అధ్యక్షుడికి ఉగ్రవాదులంటే ఎనలేని ప్రేమ అని ఆరోపిస్తూ జైషే మొహమ్మద్ చీఫ్ మసూద్ అజహర్ ను రాహుల్ ‘మసూద్ అజహర్ జీ’ అనడాన్ని ట్రెండింగ్ చేస్తోంది.
కొన్నాళ్లుగా రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్, కరడు గట్టిన ఉగ్రవాది మసూద్ అజహర్ ను వదిలి పెట్టింది బీజేపీయే అని విమర్శల దాడి చేస్తోంది. 1999లో హైజార్ల డిమాండ్ కు తలొగ్గారని ఆరోపిస్తోంది. ఇవాళ ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ కూడా రాహుల్ ఇదే ఆరోపణ చేశారు. ‘పుల్వామాలో ఒక బాంబు పేలుడు జరిగింది. 40-45 మంది మన సీఆర్పీఎఫ్ సిబ్బంది అమరులయ్యారు. ఆ బాంబు దాడి చేసిందెవరు? జైషే మొహమ్మద్’ అని రాహుల్ అన్నట్టు ఏఎన్ఐ వార్తాసంస్థ తెలిపింది.
‘మీకు మసూద్ అజహర్ గుర్తుండి ఉండొచ్చు. 56 అంగుళాల వారికి చెందిన గత ప్రభుత్వ హయాంలో ఇవాళ్టి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ఒక విమానంలో మసూద్ అజహర్ జీని తీసుకెళ్లి వాళ్లకి అప్పగించారు’ అని కాంగ్రెస్ అధ్యక్షుడు ఢిల్లీలో నిర్వహించిన ఒక పార్టీ కార్యక్రమంలో అన్నారు.
ఈ వీడియో క్లిప్ లు సోషల్ మీడియాలోకి రాగానే బీజేపీ నేతలు, మద్దతుదారులు ఎదురుదాడి ప్రారంభించారు. “#RahulLovesTerrorist”, “#RahulMasoodJiComment”, “#MasoodAzharJI”, “#RahulMasoodJiRemark” హ్యాష్ ట్యాగ్ లు ట్విట్టర్ లో టాప్ ట్రెండింగ్ లోకి వచ్చాయి.
What is common between Rahul Gandhi and Pakistan?
Their love for terrorists.
Please note Rahul ji’s reverence for terrorist Masood Azhar – a testimony to #RahulLovesTerrorists pic.twitter.com/CyqoZ7b9CF
— Smriti Z Irani (@smritiirani) March 11, 2019
Come on “Rahul Gandhi Ji”!
Earlier it were the likes of Digvijay Ji who called “Osama Ji” and “Hafiz Saeed Sahab”.
Now you are saying “Masood Azhar Ji”.
What is happening to Congress Party? pic.twitter.com/fIB4FoOFOh
— Ravi Shankar Prasad (@rsprasad) March 11, 2019
కాంగ్రెస్ కూడా ధీటుగా స్పందించింది. తన మాటల దాడిని తీవ్రతరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత సన్నిహితుడిగా చెప్పుకొనే జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ ని కాంగ్రెస్ నిరంతరం టార్గెట్ చేస్తోంది. ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానం IC-814 హైజాక్ సంఘటనలో చర్చల్లో భాగంగా మసూద్ అజహర్ విడుదలకు దోవల్ సహకరించారని విమర్శిస్తోంది. ఈ నిర్ణయం కారణంగా పాకిస్థాన్ లో నివసిస్తున్న ఉగ్రవాది గత నెలలో జమ్ముకశ్మీర్ లోని పుల్వామా దాడికి కుట్ర చేసి 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్ల ప్రాణాలు పొట్టనబెట్టుకున్నాడని రాహుల్ గాంధీ ఆరోపిస్తున్నారు.
2 questions to BJP & select Bhakt Media,who deliberately seek to twist the ‘Masood’ sarcasm of Rahulji-:
1 Did NSA Doval not escort & release terrorist Masood Azhar in Kandahar?
2 Did Modiji not invite Pak's rogue ISI to investigate Pathankot terror attack? #BJPLovesTerrorists pic.twitter.com/nBvjsQi7Mp
— Randeep Singh Surjewala (@rssurjewala) March 11, 2019