బాలీవుడ్ క్లాసిక్ దిల్ వాలే దుల్మానియా లేజాయేంగే సినిమా నచ్చని వారంటూ ఉండరు. టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అందుకు మినహాయింపేమి కాదు. తాజాగా ఈ సినిమాకు సంబందించి బన్నీ పెట్టిన పోస్ట్ వైరల్‌గా మారింది. సోమవారం రాత్రి డీడీఎల్ సినిమా చూసిన బన్నీ స్క్రీన్ షాట్ తో పాటు ఆసక్తికర కామెంట్ చేశాడు.
‘1995లో తొలిసారిగా ఈ సినిమాలో తుజే దేఖాతో యే జానా సనమ్ పాటు చూసినప్పుడు నా జీవితంలో హైయ్యస్ట్ మ్యాజిక్ ఫీల్ అయ్యాను. ఇప్పుడు 23 ఏళ్ల తరువాత ఆ పాట మళ్లీ చూశాను. ఇప్పుడు కూడా అదే మ్యాజిక్ ఫీల్ అయ్యాను. నా జీవితంలోనే హైయ్యస్ట్ సినిమాటిక్ మూమెంట్. ఎప్పటికీ’ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశాడు బన్నీ.