‘మా’ ఎన్నికలు అక్టోబరు 10న నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికల అధికారిగా హైకోర్టు అడ్వకేట్ కృష్ణమోహన్ ను నియమిస్తూ.. ‘మా’ అధ్యక్షుడు నరేశ్ నిర్ణయం తీసుకున్నారు. బైలాస్ ప్రకారం ఎన్నికల అధికారిని నియమించే అధికారం మా అధ్యక్షుడికి ఉంటుంది. జీవీ నారాయణరావును సహాయక ఎన్నికల అధికారిగా నియమించారు. ఎన్నికల సమయంలో ‘మా’ క్రమశిక్షణా సంఘం ఛైర్మన్ కృష్ణంరాజు భారత్‌లో ఉండడం లేదు. ఆయన విదేశాలకు వెళతారని .. ఆ సమయంలో ఎన్నికల బాధ్యతలు నిర్వహించడానికి పి.శివకృష్ణను నియమిస్తూ తాజాగా నిర్ణయం తీసుకున్నారు.
ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో విడుదలవుతుంది. ఆ తర్వాత ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేలా చూసే బాధ్యత ఎన్నికల అధికారిదే. జీవీ నారాయణరావును అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ గా నియమించారు. బైలాస్ ప్రకారం ప్రస్తుత అధ్యక్షుడే ఎన్నికల అధికారిని నియమించే నియమం ఉందని తెలుస్తోంది. ఈ సారి ఎన్నికల్లో ప్రకాష్ రాజ్, మంచు విష్ణు పోటీ చేస్తున్నారు. అనుకోని విధంగా బండ్ల గణేష్ కుడా పోటీ చేయనున్నట్లు ప్రకటించాడు.