HomeTelugu Big Stories'బాహుబలి'ని విమర్శిస్తోన్న సీనియర్ దర్శకుడు!

‘బాహుబలి’ని విమర్శిస్తోన్న సీనియర్ దర్శకుడు!

తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటిచెప్పిన ‘బాహుబలి’ సినిమా ఎన్నో రికార్డులను తిరగరాసింది. సినిమా విడుదలయ్యి నెల రోజులు దాటుతున్నా.. ఇంకా ప్రేక్షకుల్లో దీని మేనియా తగ్గలేదు. దాదాపు 1650 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన ఈ సినిమా ఇంకా బాక్సాఫీస్ వద్ద పరుగులు పెడుతూనే ఉంది. సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులంతా ఈ సినిమాను పొగుడుతూనే ఉన్నారు. కానీ ప్రముఖ సీనియర్ దర్శకుడు ఆదూర్ గోపాలకృష్ణన్ మాత్రం ‘బాహుబలి’ని తీసిపారేయడం చర్చనీయాంశం అయింది. రీసెంట్ గా కేరళలో ‘మనోరమా న్యూస్ కాంక్లేవ్ 2017’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆదూర్ గోపాలకృష్ణన్ బాహుబలి ప్రస్తావనను తీసుకొచ్చారు.
అసలు బాహుబలిలో ఏముందని చులకనగా తీసిపాడేశారు. 1951లో వచ్చిన ‘పాతాళభైరవి’ సినిమాకు ఇది కాపీ అంటూ ఇలాంటి సినిమాలు చేయడం వలన సమాజంపై నెగెటివ్ ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అందరూ అంటున్నట్లుగా ఈ సినిమా వల్ల భారత సినీ పరిశ్రమకు ఒరిగిందేమీ లేదని అన్నారు. పది కోట్ల బడ్జెట్ తో పది సినిమాలు చేయొచ్చు అలాంటిది కొన్ని వందల కోట్ల పెట్టుబడి పెట్టి ఇలాంటి సినిమాలు చేస్తున్నారు. నేను అయితే ఇలాంటి సినిమాలు చూడడానికి పది రూపాయలు కూడా వృధా చేయనని వ్యాఖ్యానించారు. ఎవరు ఎలాంటి కామెంట్స్ చేసినా.. బాహుబలి మాత్రం తన హవాను కొనసాగిస్తునే ఉంది. 
 
 

Recent Articles English

Gallery

Recent Articles Telugu