అడివి శేష్ ప్రస్తుతం గూఢచారి సీక్వెల్స్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన కొత్త సినిమాకు సంబంధించిన ప్రకటన వచ్చింది. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకి ప్రముఖ సినిమాటోగ్రాఫర్ షానీల్ డియో దర్శకత్వం వహించబోతున్నాడు. ఇంతకు సంబంధించిన అధికారిక ప్రకటన రావడంతో షూటింగ్ ఎప్పుడు ప్రారంభం అవుతుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో సుప్రియ యార్లగడ్డ నిర్మించబోతున్నారు. మరో ప్రముఖ నిర్మాత కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉంటాడనే వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించబోతున్న నేపథ్యంలో అంచనాలు భారీగా ఉన్నాయి.
ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ పూర్తిగా అడివి శేష్ పూర్తి చేశాడు. తన గత చిత్రాలకు వర్క్ చేసిన షానీల్ డియో తో ఉన్న పరిచయం నేపథ్యం లో కొత్త సినిమా దర్శకత్వ బాధ్యతలను ఆయనకి ఇచ్చాడు అంటూ వార్తలు వస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్ లో పుట్టిన షానీల్ డియో తెలుగు లో చాలా సినిమాలకు సినిమాటోగ్రఫీ అందించాడు.
ఆ సినిమాలు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో పాటు, ఆయనకు మంచి పేరును తెచ్చి పెట్టాయి. ఇప్పుడు షానీల్ డియో దర్శకుడిగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. మరి దర్శకుడిగా షానీల్ డియో ఎలాంటి ఫలితాన్ని ఆయన దక్కించుకుంటాడు అనేది చూడాలి.