HomeTelugu Trendingఅనన్య పాండేతో డేటింగ్‌పై ఆదిత్యరాయ్ ఏమన్నారంటే

అనన్య పాండేతో డేటింగ్‌పై ఆదిత్యరాయ్ ఏమన్నారంటే

Ananya pande adityaAditya Roy: బాలీవుడ్ యంగ్ హీరో ఆదిత్య రాయ్ కపూర్, హీరోయిన్ అనన్య పాండే ఇద్దరూ డేటింగ్‌లో ఉన్నారంటూ చాలా కాలంగా రూమర్లు వస్తున్నాయి. వీరిద్దరూ కలిసి పార్టీలకు, ఈవెంట్లకు హాజరవుతున్నారు. రూమర్లపై మాత్రం ఇద్దరూ మౌనంగానే ఉంటున్నారు.

బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ నిర్వహిస్తున్న ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోకు ఆదిత్య రాయ్ కపూర్ వచ్చారు. ఆదిత్య రాయ్ కపూర్‌తో పాటు హీరో అర్జున్ కపూర్ కూడా హాజరయ్యారు. ఇందులో పెళ్లి కానీ బాయ్స్ వచ్చేశారని కరణ్ అన్నారు. ఆ తర్వాత అనన్య పాండేతో డేటింగ్ రూమర్ల గురించి ఆదిత్యను ప్రశ్నించారు.

‘అనన్య పాండేతో నువ్వు డేటింగ్ చేస్తున్నావని రూమర్లు వస్తున్నాయి’ అని ఆదిత్య రాయ్‌ను కరణ్ జోహార్ అడగ్గా “మీరు నన్ను రహస్యాలు అడగొద్దు.. నేను మీకు అబద్ధాలు చెప్పను అని ఆదిత్య బదులిచ్చారు.

రూమర్లపై మాట దాటవేస్తూ మూవింగ్ ఆన్ అంటూ వేరే విషయాలు అడగాలని ఆదిత్య కపూర్ చెప్పారు. అలా డేటింగ్ రూమర్లపై స్పష్టత ఇవ్వకుండా మరోసారి దాటవేశారు.

గతంలో కాఫీ విత్ కరణ్ టాక్‍ షోకు అనన్య పాండే, సారా అలీ ఖాన్ కలిసి వచ్చినప్పుడు ఆదిత్య తనకు మంచి ఫ్రెండ్ అని అనన్య చెప్పింది. రిలేషన్ గురించి అడిగితే అవునని, కాదని ఏమీ చెప్పకుండా సస్పెన్స్‌లో ఉంచింది.

ఆదిత్య రాయ్ కపూర్ కూడా అలాంటి సమాధానమే ఇచ్చాడు. ఏమీ చెప్పకున్నా ఆదిత్య, అనన్య ప్రేమలో ఉన్నారని నెటిజన్లు మరోసారి కామెంట్లు చేస్తున్నారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu