HomeTelugu Trendingపూజారిగా ఆదిత్య ఓం

పూజారిగా ఆదిత్య ఓం

Aditya om stunning look

టాలీవుడ్‌లో ‘ప్రేమలో పావని కల్యాణ్‌’ ,‘లాహిరి లాహిరి లాహిరి’ వంటి సినిమాల్లో నటించి ఆకట్టుకొన్న నటుడు ఆదిత్య ఓం. ఆయన తాజగా హీరోగా నటిస్తున్న చిత్రం ‘దహనం’. ఈ మూవీలో ఆదిత్య కొంతమంది బడా వ్యాపారవేత్తల నుంచి నుంచి గుడిని కాపాడుకునే పూజారి పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమా లో ఆదిత్య 1980వ కాలంలో సాగే అప్పటి కాలం వ్యక్తిగా కనిపించబోతున్నాడు. అందుకు తగ్గ మేకోవర్ కూడా పూర్తి చేశాడు. ఓపెన్ ఫీల్డ్ మీడియా బ్యానర్ పతాకంపై డాక్టర్ పి సతీష్ కుమార్, డాక్టర్ అర్ బలరాం సాయిలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

ఎడారి మూర్తిసాయి డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీకి డాక్టర్ పి సతీష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఎఫ్ఎం బాబాయి, శాంతి చంద్రలు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. కాగా ఇప్పటికి ఈ సినిమా విశాఖపట్నం చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో షూటింగ్‌ను పూర్తి చేసుకుంది. ఈ నేపథ్యంలో దర్శక నిర్మాతలు మాట్లాడుతూ.. కె.విశ్వనాథ్, బాపుల సినిమాల మ్యాజిక్ ఫీల్ ఈ సినిమాలో ఉండబోతుందని, త్వరలోనే ఈ మూవీ ఫస్ట్‌లుక్‌, ట్రైలర్‌ను కూడా విడుదల చేయబోతున్నట్లు తెలిపారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu