HomeTelugu Trendingనగ్నంగా నటించిన టాలీవుడ్‌ హీరో .. వైరల్‌

నగ్నంగా నటించిన టాలీవుడ్‌ హీరో .. వైరల్‌

aditya om playing

టాలీవుడ్‌ హీరో ఆదిత్య ఓం గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. ఆయన ప్రస్తుతం ఓ ఛాలెంజింగ్‌ రోల్‌లో నటిస్తున్నాడు. గల్లీ సినిమా బ్యానర్ లో ‘బంధీ’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాని వెంకటేశ్వర రావు దగ్గు, తిరుమల రఘు నిర్మిస్తుండగా.. తిరుమల రఘు దర్శకత్వం వహిస్తున్నారు.

ఇటీవల బంధీ చిత్రానికి సంబంధించిన ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఈ ట్రైలర్‌లో సినిమా కాన్సెప్ట్ గురించి చెప్పే ప్రయత్నం చేశారు. ఓ సగటు మనిషి కోరుకునేవి ఎలా ఉంటాయో అందులో చూపించారు. ఏ మనిషైనా ఆహారం, నీరు, డబ్బు, స్వాతంత్ర్యం కోరుకుంటారు. స్వేచ్ఛగా విహరించాలని అనుకుంటాడు. అలాంటి వ్యక్తి జీవితంలో ఏర్పడిన ఘట్టాలనే బంధీగా రూపొందించారు.

ఇక ఈ ట్రైలర్‌లో అన్ని రకాల ఎమోషన్స్‌ను ఆదిత్య ఓం చూపించారు. చివరకు నగ్నంగా కనిపించే షాట్ మాత్రం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఒక్క డైలాగ్ లేకుండా, సింగిల్ పాత్రతో ఆసక్తికరంగా బంధీ ట్రైలర్ సాగింది. బంధీ చిత్రానికి రఘు తిరుమల దర్శకత్వం వహించగా వీరల్, లవన్, సుదేష్ సావంత్ సంగీతాన్ని అందించారు.

దేశంలోని పలు అటవీ ప్రాంతాల్లో ఈ మూవీని షూట్ చేశారు. ఇక ఈ సినిమాలో ఆదిత్య ఓం ఎలాంటి డూప్ లేకుండా అన్ని రకాల స్టంట్స్ చేశారు. మూడేళ్లు కష్టపడి ఏడాదిలో ఉండే అన్ని రుతువుల్ని కవర్ చేస్తూ ఈ మూవీని షూట్ చేశారు. పర్యావరణ సంరక్షణ మీద తీసిన ఈ బంధీ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu