HomeTelugu Trendingనటిని పెళ్లాడిన సింగర్‌ ఉదిత్ నారాయణ్ కుమారుడు

నటిని పెళ్లాడిన సింగర్‌ ఉదిత్ నారాయణ్ కుమారుడు

Aditya narayan married actrప్రముఖ గాయకుడు ఉదిత్ నారాయణ్ కుమారుడు ఆదిత్య నారాయణ్ ఓ ఇంటి వాడయ్యాడు. తాను ప్రేమించిన నటి శ్వేతా అగర్వాల్ ను పెళ్లి చేసుకున్నాడు. ముంబైలోని ఇస్కాన్ శ్రీకృష్ణ దేవాలయంలో వీరిద్దరి వివాహం కొద్ది మంది బంధుమిత్రుల సమక్షంలో మంగళవారం జరిగింది. ఈ పెళ్లి ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎన్నో సంవత్సరాల పాటు శ్వేతతో చేసిన స్నేహం, తరువాత ప్రేమగా మారగా, వీరిద్దరి వివాహానికి పెద్దలు అంగీకరించారు.

తండ్రిలాగే గాయకుడిగానూ సినీ అభిమానులకు పరిచితమైన ఆదిత్య, టీవీ షోలకు వ్యాఖ్యాతగానూ వ్యవహరించాడు. శ్వేతతో కలిసి ‘షాపిత్’ అనే చిత్రంలో నటించి, నటుడిగానూ తానేంటో నిరూపించుకున్నాడు. పలువురు సెలబ్రిటీలు అభిమానులు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Saroj_Mahara (@saroj_maharaa)

Recent Articles English

Gallery

Recent Articles Telugu