మెగా స్టార్ చిరంజీవి తాజా చిత్రం ఆచార్యపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ఆడియో హక్కులను ఆదిత్య మ్యూజిక్ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. దీనికోసం రూ. 4 కోట్ల భారీ మొత్తం చెల్లిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. శ్రీమతి సురేఖ కొణిదెల సమర్పణలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై రామ్ చరణ్, నిరంజన్ రెడ్డి నిర్మిస్తున్నారు.