పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ‘ఆది పురుష్’. ఈ సినిమా నుండి ప్రభాస్ ఫస్ట్ లుక్ ను చిత్ర దర్శకుడు ఓం రౌత్ శుక్రవారం ఉదయం విడుదల చేశాడు. ఈ సినిమాలో ప్రభాస్ శ్రీరాముడి పాత్రలో కనిపిస్తూ ఆకాశానికి విల్లును ఎక్కు పెట్టిన పోస్ట్ అద్భుతంగా ఉంది. ఓం రౌత్ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఈ ఫస్ట్ లుక్ క్షణాల్లో వైరల్ అయింది. ఈ చిత్రం టీజర్ ను ఆదివారం విడుదల చేస్తున్నట్టు దర్శకుడు ఓం రౌత్ తెలిపాడు. ఉత్తరప్రదేశ్, అయోధ్యలోని సరయూ నది ఒడ్డున టీజర్ లాంచ్ చేస్తామని ప్రకటించాడు.
ఆదివారం రాత్రి 7.11 గంటలకు టీజర్ విడుదల అవుతుందని, ఈ కార్యక్రమంలో పాల్గొనాలని అభిమానులకు పిలుపునిచ్చాడు. ఈ సినిమాలో కృతి సనన్ సీతాదేవిగా నటించింది. రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. వచ్చే ఏడాది జనవరి 12వ తేదీన పలు భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.