HomeTelugu Big Stories'ఆదిపురుష్‌' రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

‘ఆదిపురుష్‌’ రిలీజ్‌ డేట్‌ వచ్చేసింది

Adipurush release date anయంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ ప్రస్తుతం ‘రాధే శ్యామ్‌’ సినిమాతో బీజీగా ఉన్నాడు. ఇక బాలీవుడ్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ దర్శకత్వంలో ‘ఆది పురుష్‌’ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఓ అప్‌డేట్‌ వచ్చింది. తాజాగా ‘ఆది పురుష్‌’ విడుదల తేదీని ప్రకటించింది చిత్ర బృందం.ఆగస్టు 11, 2022న ఆదిపురుష్‌ విడుదల కానుందని ట్విట్టర్‌ ద్వారా ప్రకటించింది. ఈ వార్త బయటకు రాగానే, సోషల్‌ మీడియాలో మరోసారి ‘ఆదిపురుష్’ ట్యాగ్ వైరల్ అవుతోంది. ఇదో భారీ బడ్జెట్‌ ఫ్యాంటసీ చిత్రం. ఇందులో ప్రభాస్‌ రాముడిగా, బాలీవుడ్‌ హీరో సైఫ్‌ అలీ ఖాన్‌ రావణాసురుడిగా కనిపించనున్నారు. ఈ చిత్రాన్ని భూషణ్‌ కుమార్‌ నిర్మిస్తున్నారు. ఇప్పటికే అభిమానులు ప్రభాస్‌ రాముడి పాత్రలో ఉన్న ఫొటోలు వైరల్‌ చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu