శర్వానంద్ కు ప్రస్తుతం బ్యాడ్ టైం నడుస్తుందని క్లియర్ గా తెలుస్తుంది. ‘పడి పడి లేచె మనసు’ ‘రణరంగం’ ‘జాను’ ‘శ్రీకారం’ ‘మహాసముద్రం’ వంటి 5 డిజాస్టర్లతో వెనుకపడిపోయిన అతను ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ తో తన బ్యాడ్ ఫామ్ ను కంటిన్యూ చేస్తున్నాడు. ఈ చిత్రం తొలిరోజు డీసెంట్ టాక్ ను రాబట్టుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద ఏమాత్రం పెర్ఫార్మ్ చేయలేకపోయింది. పెద్ద సినిమాల మధ్యలో ఈ మూవీకి టికెట్ పెట్టడం జనాలకి ఇష్టం లేదనుకుంట. హీరోయిన్ రష్మిక స్టార్ డం కూడా ఈ మూవీని ఆదుకోలేకపోయింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్లు గమనిస్తే :
నైజాం : 2.56 కోట్లు
సీడెడ్ : 0.77 కోట్లు
ఉత్తరాంధ్ర : 0.87 కోట్లు
గుంటూరు : 0.50 కోట్లు
ఈస్ట్ : 0.49 కోట్లు
వెస్ట్ : 0.37 కోట్లు
కృష్ణా : 0.46 కోట్లు
నెల్లూరు : 0.29 కోట్లు
————————————————
తెలంగాణ + ఏపి : 6.31 కోట్లు
రెస్ట్ ఆఫ్ ఇండియా : 0.37 కోట్లు
ఓవర్సీస్ : 0.89 కోట్లు
————————————————
వరల్డ్ వైడ్(టోటల్) : 7.57 కోట్లు(షేర్)
‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ కి రూ.16 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. రూ.16.5 కోట్ల బ్రేక్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫుల్ రన్ ముగిసేసరికి కేవలం రూ.7.57 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దాంతో ఈ చిత్రం కొనుగోలు చేసిన బయ్యర్లకి బిజినెస్ మీద రూ.8.43 కోట్లు నష్టాల్ని మిగిల్చింది. శర్వానంద్ కెరీర్ లో ఇది 6 వ డిజాస్టర్ గా మిగిలింది.