HomeTelugu NewsAdah Sharma: 48 రోజులు నరకం.. షాకింగ్ న్యూస్ బయటపెట్టిన హీరోయిన్

Adah Sharma: 48 రోజులు నరకం.. షాకింగ్ న్యూస్ బయటపెట్టిన హీరోయిన్

Adah Sharma: 48 days of hell.. Heroine who revealed shocking news
Adah Sharma: 48 days of hell.. Heroine who revealed shocking news

Adah Sharma Movies: నితిన్ హీరోగా వచ్చిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ అదాశర్మ. అయితే ఈ మధ్య విడుదలైన ది కేరళ స్టోరీ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అందరికీ నోటీస్ అయ్యింది. కాగా ఇప్పుడు ఈ హీరోయిన్ ఒక అరుదైన వ్యాధి ఎదుర్కొంటున్నానని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.

Adah Sharma Health Problem 

మామూలుగా తెరపై హీరోయిన్లు గ్లామర్‌గా, బాగా ఫిట్‌గా కనిపించడానికి నానారకాల కసరత్తులు చేస్తూ ఉండడం మనం చూస్తూనే ఉంటాం. అయితే వారు పాటించే పద్ధతుల వల్ల.. లేదా సినిమాల కోసం కష్టపడే తీరు వల్ల.. కొన్నిసార్లు  అరుదైన వ్యాధులతో ఇబ్బంది పడుతుంటారు.

గడిచిన కొద్ది సంవత్సరాల లో ఎంతోమంది సెలబ్రెటీస్ దగ్గర నుంచి.. కొన్ని ఆరోగ్య సమస్యలు వింటూనే వచ్చాంస ‌ ముఖ్యంగా టాలీవుడ్‌ అగ్రతార సమంత మయోసైటీస్‌ అనే అరుదైన వ్యాధితో బాధపడుతోంది అని చెప్పినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు. తాజాగా అదాశర్మ కూడా తనకు ఓ అరుదైన వ్యాధి ఉందని చెప్పుకొచ్చింది. అంతేకాదు దీనివల్ల తాను చాలా బాధపడాల్సి వస్తుందని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది.

“కేరళ స్టోరీ చిత్రంలో నటించినప్పుడు కాలేజీ అమ్మాయిలా కనిపించడానికి.. నేను చాలా బరువు తగ్గాల్సి వచ్చింది. ఇక ఆ తర్వాత ‘బస్తర్‌’ చిత్రంలో నటించినప్పుడు బరువు పెరిగాను. ఎందుకంటే ఆ చిత్రంలో బరువైన గన్స్‌ నేను మొయ్యాలి. ఇక లావుగా కనిపించడంతో పాటు .. కొంచెం బలంగా ఉండటానికి రోజు 10-12 అరటిపళ్లు తినేదాన్ని. అలానే గింజలు, డ్రై ఫ్రూట్స్‌, ఫ్లాక్‌ సీడ్స్‌ ఉన్న లడ్డూలు నాతో పాటు షూటింగ్‌కి తీసుకెళ్తూ ఉండేదాన్ని. నిద్రపోయే అరగంట ముందు రెండు లడ్డూలు తినేదాన్ని. కానీ ఇప్పుడు మళ్లీ బరువు తగ్గాల్సి వచ్చింది. ఇలా నెలల వ్యవధిలో బరువు తగ్గడం-పెరగడం వల్ల నా శరీరంలో చాలా మార్పులు వచ్చి బాగా స్ట్రెస్ కి గురయ్యాను. దీనివల్ల ఎండోమెట్రియోసిస్‌ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు తేలింది. దీని వల్ల పీరియడ్స్‌ ఆగకుండా నాకు వస్తూనే ఉంటాయి. ఈ జబ్బు కారణంగా దాదాపు 48 రోజులపాటు నాన్‌ స్టాప్‌ పీరియడ్స్‌ వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డాను’ అని అదాశర్మ చెప్పుకొచ్చింది.

ఇక ఈ హీరోయిన్ చెప్పిన మాటలు కాస్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నాయి.

Recent Articles English

Gallery

Recent Articles Telugu