HomeTelugu Big Storiesఒక్క నిమిషంలో 21 హ్యాండ్‌స్టాండ్స్‌.. అదా శర్మ వీడియో వైరల్‌

ఒక్క నిమిషంలో 21 హ్యాండ్‌స్టాండ్స్‌.. అదా శర్మ వీడియో వైరల్‌

10 15

‘అదా శర్మ’ పెద్దగా పరిచయం అవసరం లేని పేరు. తరచూ హాట్‌ ఫొటోషూట్‌, ఫిట్‌నెస్‌, డ్యాన్స్‌ వీడియోలను షేర్‌ చేస్తూ.. నెటిజన్లకు టచ్‌లో ఉంటుంది. ఈ అమ్మడు ఫిట్‌నెస్‌ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటుందో మనకు తెలిసిందే. తాజాగా హ్యాండ్‌స్టాండ్స్‌ చేస్తుండగా తీసిన వీడియోను షేర్‌ చేసింది ఈ బ్యూటీ. ‘ఒక్క నిమిషంలో మీరెన్ని హ్యాండ్‌ స్టాండ్స్‌ చేయగలరు?. ట్రైనర్‌ సమక్షంలోనే ఈ వ్యాయామం చేయాలి. లేకపోతే ప్రయత్నించొద్దు’ అని హెచ్చరించింది ఈ భామ. కేవలం ఒక్క నిమిషంలో 21 హ్యాండ్‌స్టాండ్స్‌ చేసింది. దీన్ని చూసిన నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ‘మీ ఎనర్జీకి సాటిలేరు, వావ్‌, సూపర్‌..’ అంటూ కామెంట్లు చేశారు.

Recent Articles English

Gallery

Recent Articles Telugu