తమిళ నటి విజయలక్ష్మి తనను సోషల్ మీడియాలో వేధిస్తున్నారని ఆత్మహత్యకు ప్రయత్నించింది. దానికంటే ముందు ఫేస్‌బుక్ లో వీడియో పోస్ట్ చేసింది. ప్రస్తుతం చెన్నైలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో విజయలక్ష్మి కి చికిత్స జరుగుతుంది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వస్తున్న వేధింపులు భరించలేక ఈ నిర్ణయం తీసుకుంది. అంతకంటే ముందు ఫేస్ బుక్‌లో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ తర్వాత కొన్ని టాబ్లెట్స్ మింగేసింది. నామ్ తమిళర్ కచ్చి పార్టీ లీడర్ సీమాన్ అలాగే హరి నడర్ కారణంగానే ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆ వీడియోలో స్పష్టం చేసింది. అలాగే ఇదే తన చివరి వీడియో అంటూ తెలిపింది.
ఈ వీడియోలో ఆమె మాట్లాడుతూ.. ఇదే తన చివరి వీడియో అని, సీమన్, అతడి పార్టీ కార్యకర్తల వల్ల గత నాలుగు నెలలుగా తీవ్ర మానసిక ఆందోళనకు గురవుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. హరి నాడార్ మీడియాలో తనను అవమానించారని, మరి కాసేపట్లో తన బీపీ పడిపోతుందని, ఆ తర్వాత ప్రాణం పోతుందని పేర్కొన్నారు. అంతేకాదు, చావు కనువిప్పు కావాలని, తనను వేధింపులకు గురిచేసిన సీమన్, హరినాడార్‌లను విడిచిపెట్టవద్దని తన అభిమానులను కోరారు.