టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ సురేఖ వాణి సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తెరపై ఎక్కువగా సాంప్రదాయబద్దమైన పాత్రల్లో కనిపించే సురేఖ వాణి.. రియల్ లైఫ్‌లో మాత్రం ఎక్కువగా ట్రెడిషినల్ లుక్‌లోనే కనిపిస్తుంటారు. సోషల్ మీడియాలో మాత్రం లో రెంజ్‌లో రచ్చ చేస్తుంది. కూతురు సుప్రితతో కలిసి పొట్టి దుస్తులు వేస్తూ అందాలు ఆరబోస్తుంటారు. ఈ ఫొటోలపై వీపరితమైన ట్రోల్స్ కూడా వచ్చాయి. వీటిపై తల్లీ కూతురు ఘాటుగానే స్పందిస్తుంటారు. తాజాగా సురేఖ వాణి సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అయింది. ఇందులో తన ఇష్టాన్ని బయట పెట్టేసింది. తాను ప్రేమలో ఉన్నానని తెలిపింది. అయితే ఆ ప్రేమ వ్యక్తులపై కాదు, ఆమె ధరించిన నెక్లెస్‌తో లవ్‌లో ఉంది. ఈ విషయాన్నే సురేఖా వాణి చెబుతూ.. నెక్లెస్‌తో ప్రేమలో ఉన్నాను అని పేర్కొంది. ప్రస్తుతం సురేఖా వాణి పోస్ట్ వైరల్ అవుతోంది.