టాలీవుడ్‌లో నాని సినిమా జెర్సీతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్. ఈ సినిమాతో మంచి మార్కులే కొట్టేసింది ఈ భామ. ఇప్పటికే తమిళంలో స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. అక్కడ చాలా సినిమాల్లోనే నటించింది. ఇప్పుడు ఈమెకు కరోనా అంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో స్పందించింది. ఈ మధ్య చాలా మందికి ఇలా కరోనా వచ్చిందంటూ సోషల్ మీడియాలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై స్పందించిన శ్రద్ధా అసలు విషయం బయటపెట్టింది. తాను క్వారంటైన్‌లో ఉన్న మాట నిజమే కానీ తనకు కరోనా వైరస్ సోకలేదని చెబుతోంది శ్రద్ధా శ్రీనాథ్.
ఎక్కువగా ఎయిర్ ట్రావెల్ చేయడంవలన ముందు జాగ్రత్తగా 14 రోజులపాటు హోంక్వారంటైన్‌లో ఉన్నానని చెప్పింది. మార్చి 12 నుంచి 15 తేదీలమధ్య హైదరాబాద్ నుంచి చెన్నై విమాన ప్రయాణం చేశానని.. అందులో ఎవరికీ కరోనా సోకలేదని.. అయినా రిస్క్ ఎందుకని తన ఫ్యామిలీ డాక్టర్ సూచన మేరకు 14 రోజుల పాటు హోం క్వారంటైన్‌లో ఉన్నానని ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది ఈ ముద్దుగుమ్మ. మార్చి 29తో క్వారంటైన్ పూర్తి కావడంతో ఇప్పుడు హాయిగా అమ్మకు వంటల్లో సాయం చేస్తున్నానని చెప్పింది.
I CHOSE to self isolate for 14 days upon the advice of my cousin doctor who told me to do it as a precautionary measure – as every responsible and aware citizen has been and should be doing after international/domestic travels.
— Shraddha Srinath (@ShraddhaSrinath) April 2, 2020