శృంగార తారగా ప్రేక్షకులను అలరించిన నటి షకీలా పలు భాషల్లో 200కి పైగా చిత్రాల్లో నటించింది. హీరోలకు సమానంగా క్రేజ్ సంపాదించుకున్న నటి షకీలా ఇప్పుడు సొంతంగా ఓటీటీ ఫ్లాట్ఫాంతో డిజిటల్ రంగంలోకి ఎంట్రీ ఇవ్వబోతుంది. ఇందులో తన చిత్రాలతో పాటు ఇతర సినిమాలనూ రిలీజ్ చేస్తానంటోంది. తన కుమార్తెను హీరోయిన్గా పరిచయం చేస్తూ రెండు చిత్రాలను అనౌన్స్ చేసింది. ఈ రెండు సినిమాల్లో తన కూతురితో కలిసి నటించినట్లు తెలిపింది. దీనికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేసింది. గోవాలో చిత్రీకరణ చేస్తున్నట్లు తెలిపింది. గతంలో తాను నటించి, నిర్మించిన చిత్రం విడుదల విషయంలో సెన్సార్ వద్ద చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు తెలిపింది. అందుకే సొంతంగా ఓటీటీ సంస్థను ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపింది.