సినీ నటి సనూష తన జీవితంలో ఎదురైన ఇబ్బందులను, బయటపడిన విధానం తెలుపుతూ అందరికి కాస్త ధైర్యం నూరిపోద్దామనుకొని నెటిజన్ల ట్రోలింగ్‌కు గురైంది. బాలనటిగా గుర్తింపు తెచ్చుకుని నాని హీరోగా వచ్చిన ‘జెర్సీ’ సినిమాలో జర్నలిస్ట్ రమ్య పాత్ర పోషించింది. ఇటీవల ఓ ఇంటర్య్వూలో మట్లాడుతూ.. గతంలో వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని, కొన్ని పరిస్థితుల కారణంగా డిప్రెషన్, మనస్తాపానికి గురయ్యానని చెప్పుకొప్పుకొచ్చింది. ఒకనొక దశలో ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వచ్చిందని, దీంతో తీవ్ర ఆందోళనకు గురయ్యానని తెలిపింది. అనంతరం ఓ వైద్యుడిని సంప్రదించి చికిత్స తీసుకొని ఆ మానసిక కుంగుబాటు నుంచి బయటకొచ్చానని చెప్పుకొచ్చింది. అయితే, ఆమె వ్యాఖ్యలపై నెటిజన్లు అసభ్యకర రీతిలో కామెంట్లు చేశారు.
నెటిజన్లు పెట్టిన కామెంట్లను ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేస్తూ మండిపడింది. డిప్రెషన్‌తో ఇబ్బందిపడేవాళ్లు, తన వీడియో చూసి కొంతమేర ధైర్యంగా ఉంటారనే ఉద్దేశంతోనే తాను మాట్లాడని తెలిపింది. సనూష్ తెలుగు, తమిళంతో పాటు పలు మలయాళీ సినిమాల్లో నటించింది. పవన్ కల్యాణ్ హీరోగా నటించిన బంగారం మూవీలో హీరోయిన్ సోదరి వింధ్య పాత్రలో, ఆ తర్వాత ‘జీనియస్’, ‘రేణిగుంట’ సినిమాల్లో కీలకపాత్రల్లో నటించింది.