టాలీవుడ్లో స్టార్ హీరోయిన్ల్లో సమంత ఒకరు. పెళ్లి తర్వాత కూడా సమంతకు డిమాండ్ ఏమాత్రం తగ్గలేదు. కాగా సమంత సినిమాలతో బిజీగా ఉంటూనే ఇతర రంగాలపై కూడా ఆమె దృష్టి సారిస్తోంది. ఇప్పటికే తన స్నేహితులతో కలిసి జూబ్లీహిల్స్ లో ‘ఏకం’ అనే ప్రీస్కూల్ ను ప్రారంభించింది. తాజాగా మహిళల వస్త్రాలకు సంబంధించిన బిజినెస్ లోకి అడుగుపెట్టబోతోంది. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా ఆమె తెలిపింది. ‘సాకి వరల్డ్’ పేరుతో దుస్తుల వ్యాపారాన్ని ప్రారంభిస్తున్నట్టు చెప్పింది. సాకిని ప్రారంభించాలని తాను ఎప్పటి నుంచో అనుకుంటున్నానని తెలిపింది. ఫ్యాషన్ పై తనకున్న ప్రేమకు సాకి ప్రతిరూపమని చెప్పింది సమంత.
Saaki @saakiworld is finally here! Saaki has been a dream of mine and my baby for many months. It is a reflection of my love for fashion and my journey in life. #saakiforyou #launchingsoon Hope you like it 💜 pic.twitter.com/cJ31pAY5Zo
— Samantha Akkineni (@Samanthaprabhu2) September 5, 2020