నటి రేణు దేశాయ్.. కరోనా నేపథ్యంలో ప్రజల్లో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఆమె పెట్టిన పోస్టు వైరల్ అవుతోంది. ‘‘బాధలు ద్వేషం వంటివి మోసి మోసి మనం గాడిదల్లా తయారవుతున్నాం. కేవలం బాధపడటానికే ఈ శరీరం లేదు కదా? బాధల్లో కూడా చిన్న చిన్న సంతోషాలను వెతుక్కుంటూ ఆనందంగా జీవించాలి. మనం ఇప్పుడు చావు-బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాం. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏది అవసరమో అది చేయాలి’’ అని భావోద్వేగం వ్యక్తపరిచారు.
ఇంకా పోస్టు కంటిన్యూ చేస్తూ… ‘‘సంతోషంగా ఉండడానికి స్టాండప్ కామెడీ వీడియోలు చూడండి.. క్యూట్ పప్పీల వీడియోస్ చూడండి. ఈ కష్టకాలం ఎక్కువ రోజులు ఉండదు. వెళ్లిపోతుంది.. పోవాల్సిందే. అదే కాలానికి ఉన్న గొప్పతనం. జాగ్రత్తలు పాటించండి.. సురక్షితంగా ఉండండి’’ అంటూ అందరిలో స్థైర్యం నిపే ప్రయత్నం చేశారు రేణు దేశాయ్. రేణు పోస్టుకు లైకులు కామెంట్ల వర్షం కురుస్తోంది. తనదైన రీతిలో కామెంట్ చేసిన ఆమెను.. నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.
View this post on Instagram