టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ రంభ కెనాడాలో రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ విషయాన్ని తనే స్వయంగా ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో మంగళవారం వెల్లడించింది. సోమవారం సాయంత్రం పిల్లలను స్కూల్ నుంచి కారులో తీసుకుని ఇంటికి వెళుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది.
చౌరస్తా వద్ద ఓ కారు రంభ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దెబ్బతిన్న కారు ఫొటోను రంభ షేర్ చేసింది. స్వల్ప గాయాలతో తామంతా సురక్షితంగా ఉన్నట్టు చెప్పింది. గాయపడిన రంభ కుమార్తె సాషను చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. తన కుమార్తె త్వరగా కోలుకోవడానికి మీ ప్రార్థనలు కావాలని రంభ పేర్కొంది. కెనాడాకు చెందిన తమిళ వ్యాపారవేత్త ఇంద్ర కుమార్ పద్మనాథన్ ను వివాహం చేసుకుంది… వీరికి ఇద్దరు కుమార్తెలు, ఒక మగబిడ్డ ఉన్నారు.