బాలీవుడ్ లో డ్రగ్స్ వివాదం కలకలం రేపుతోంది. ఈ నేపధ్యంలో కన్నడ సినీ పరిశ్రమ సైతం డ్రగ్స్ విచారణతో వణుకుతోంది. ఇప్పటికే హీరోయిన్లు సంజన, రాగిణి ద్వివేదిలను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ అరెస్ట్ చేసి, విచారిస్తోంది. టెస్టింగ్ నిమిత్తం వీరిని బెంగళూరులోని కేపీ జనరల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే, డోప్ టెస్ట్ కోసం ఇచ్చిన యూరిన్ శాంపిల్ తన యూరిన్ లో కొంత నీటిని ఆమె మిక్స్ చేసినట్టు తెలుస్తోంది. శాంపిల్ లో వాటర్ మిక్స్ అయినట్టు వైద్యులు గుర్తించారట. దీంతో, మరోసారి ఆమె వద్ద నుంచి శాంపిల్ తీసుకుని పంపినట్టు సమాచారం.
దీంతో మరోసారి ఆమె నుంచి శాంపిల్స్‌ని సేకరించి పరీక్షించినట్లు తెలుస్తోంది. కాగా మరోవైపు ఆమె కస్టడీని న్యాయస్థానం మరో మూడు రోజులకు పెంచింది. ఇదిలా ఉంటే ఇదే కేసులో అరెస్ట్ అయిన సంజన సైతం ఆసుపత్రిలో రచ్చ రచ్చ చేసింది. టెస్ట్ చేసే సమయంలో మెడికల్ సిబ్బందికి సహకరించకుండా, పోలీసులతో వాగ్వాదానికి దిగిన సంగతి తెలిసిందే.