Actress radhika in lok sabha elections: సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ లోక్‌సభ ఎన్నికల బరిలో నిలిచారు. తాజాగా బీజేపీ ప్రకటించిన నాలుగో జాబితాలో నటి రాధిక స్థానం దక్కించుకున్నారు. తమిళనాడులోని విరుధ్‌నగర్ నుంచి ఆమె పోటీ చేయనున్నారు.
కాగా.. ఇటీవలే రాధిక భర్త పార్టీని బీజేపీలో విలీనం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రకటించి జాబితాలో తమిళనాడులో 14 స్థానాలతో సహా పుదుచ్చేరి సీటుకు కూడా బీజేపీ అభ్యర్థులను ఫైనాల్ చేసింది. టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌గా నటించిన రాధిక.. పలువురు స్టార్ హీరోలతో నటించింది.
తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ సినిమాల్లో ఆమె తన నటనతో ప్రేక్షకుల మనసును దోచుకున్నారు. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా పలు సినిమాల్లో నటిస్తుంది. అంతేకాకుండా పలు రియాల్టీ షోలకు జడ్జిగా కూడా వ్యవహరించారు.