సీనియర్ నటి రాధ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ప్రముఖ బిజినెస్ మేన్ ని పెళ్లాడిన రాధ ఆ తరువాత దుబాయ్ లో సెటిలైన సంగతి తెలిసిందే. రాధకుమార్తెలు కార్తీక నాయిర్, తులసి నాయిర్ కూడా హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. కానీ ఇద్దరి కెరీర్ ఆశించిన స్థాయికి ఎదగలేదు.
అనంతరం తమ వ్యాపారాల్లో కార్తీక నాయిర్ కూడా బిజీ అయింది. ఇటీవలే కార్తీక నాయర్ నిశ్చితార్థం ఎటువంటి హంగామా లేకుండా జరిగింది. కార్తీక స్వయంగా తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో దాని గురించి హింట్ ఇచ్చారు. కాబోయేవాడితో కలిసి ఉన్న ఓ ఫోటోని షేర్ చేసింది. అయితే ఈ ఫోటోలో తన హబ్బీ ఎవరు? అనేది క్లారిటీ ఇవ్వలేదు. ఈ ఫోటోలో నిశ్చితార్థపు ఉంగరం కనిపించింది. అయితే కార్తీక ప్రియుడి గురించి ఎటువంటి సమాచారం ఇప్పటివరకూ అందుబాటులో లేదు.
కార్తీక పెళ్లి తేదీ లాక్ అయిందని సమాచారం. ప్రస్తుతం పెళ్లి పనులు జరుగుతున్నాయి. ఈ పెళ్లికి పలువురు టాలీవుడ్ ప్రముఖులకు శుభలేఖలు అందనున్నాయని కూడా టాక్ వినిపిస్తోంది. తాజాగా దర్శకేంద్రుడు కే.రాఘవేంద్రరావును రాధ కలిసారు. దీంతో కుమార్తె పెళ్లికి ఆహ్వానించేందుకు రాధ హైదరాబాద్ కి వచ్చారని అర్థమవుతోంది. అందుకు సంబంధించిన ఓ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
అయితే కార్తీక పెళ్లి ఎప్పుడు? ఎవరెవరికి ఆహ్వానాలు అందాయి? అన్నదానిపై ఎలాంటి సమాచారం లేదు. కుమార్తె పెళ్లి గురించి రాధ స్వయంగా వెల్లడిస్తారేమో చూడాలి. రాధ కుమార్తె కార్తీక 2009లో టాలీవుడ్‌లో ‘జోష్’ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత ‘రంగం’, కామెడీ మూవీ బ్రదర్ ఆఫ్ బొమ్మాళి సినిమాలతో తెగులు ప్రేక్షకులను ఆలరించింది. ఇంకా తమిళంలో పలు సినిమాల్లో నటించింది.
https://www.instagram.com/reel/CzOCFeMSLcd/?utm_source=ig_web_copy_link