90వ దశకంలో స్టార్ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న నటి రాశీ. టాలీవుడ్‌లో అమ్మో ఒకటో తారీఖు, చెప్పాలని ఉంది, శ్రీరామచంద్రులు, దీవించండి, దేవుళ్లు, నాగ ప్రతిష్ట, పెళ్లి పందిరి వంటి అనేక సినిమాల్లో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకు. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గాక.. గిరిజా కల్యాణం, జానకి కలగనలేదు వంటి పాపులర్ సీరియల్స్‌లో సైతం నటించి ఆకట్టుకుంది.
ఇప్పుడు సినిమాల్లో తల్లి పాత్రతో రెండో ఇన్నింగ్స్ ఇస్తుంది రాశీ. శివ కంఠమనేని హీరోగా నటిస్తున్న ‘రాఘవ రెడ్డి’ ‘సినిమాలో రాశి, నందితా శ్వేత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. స్పేస్ విజన్ నరసింహా రెడ్డి సమర్పణలో లైట్ హౌస్ సినీ మ్యూజిక్ బ్యానర్‌పై సంజీవ్ మేగోటి దర్శకత్వంలో KS శంకర్ రావ్, G.రాంబాబు యాదవ్, R.వెంకటేశ్వర్ రావు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీ జనవరి 5న విడుదల కాబోతోంది. ఈ మేరకు చిత్రయూనిట్ మీడియా ముందుకు వచ్చి రిలీజ్ డేట్‌ను ప్రకటించింది.
“హీరోయిన్‌గా నేను ఇది వరకు ఎన్నో చిత్రాలు చేశాను. ఈ కథ చెప్పిన వెంటనే నేను ఓకే చెప్పాను. చాలా వేరియేషన్స్ ఈ పాత్రలో ఉంటాయి. తల్లిగా ఈ పాత్ర నాకు చాలా కొత్తగా అనిపించింది. కూతురే ప్రపంచంగా బతికే ఆ పాత్ర నాకు చాలా నచ్చింది. నేను ఇందులో ఫుల్ సీరియస్ మోడ్‌లోనే ఉంటాను. శివ కంఠమనేని గారు సెట్స్ మీద ఎంతో కూల్‌గా ఉంటారు. జనవరి 5న మా చిత్రం రాబోతోంది. సక్సెస్ మీట్‌లో మళ్లీ కలుద్దాం” అని రాశీ చెప్పుకొచ్చింది.