సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులపై ఇప్పటికే ఎంతోమంది బాధితులు మీడియా ముందుకొచ్చి తన గోడును చెప్పుకున్నారు. ఇంకా కొఁతమంది సంకోచంతో అలాగే మిన్నకుండి పోయారు. మరికొందరు ఆలస్యంగానైనా బయటపడుతున్నారు. తాను ఎదుర్కొన్న సమస్యలను వెల్లడిస్తున్నారు. తాజాగా తమిళ నటి కల్యాణి కూడా సినీ పెద్దల నుంచి తాను ఎదుర్కొన్న వ్యధను బయటపెట్టింది. ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖుల నుంచి తనకు లైంగిక వేధింపులు ఎదురయ్యాయని ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.
తమిళంలోని జయం, అలాతండా వానమ్, ఎస్‌ఎంఎస్ సినిమాలతో అలరించిన నటి కల్యాణి తెలుగులోనూ ‘మళ్లీ మళ్లీ’ చిత్రంలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. సినిమాలతో పాటు పలు సీరియల్స్‌లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఆమె కొంతకాలంగా ఇండస్ట్రీకి దూరంగా ఉంది. ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ప్రభుదేవా పక్కన నటించి మంచి పేరుతెచ్చుకుంది. హీరోయిన్‌గా అవకాశాలు వస్తున్న సమయంలో కొంతమంది పెద్దలు తనను లైంగిక వేధింపులకు గురిచేశారట. నటి కల్యాణి తల్లికి ఫోన్ చేసి ఇలాంటివి మామూలే.. సినిమాల్లో అవకాశాలు రావాలంటే కొన్ని సర్దుకుపోవాలంటూ ఒత్తిడి చేసేవారట. అందుకే ఇండస్ట్రీకి దూరమయ్యానంటోంది నటి కల్యాణి. బుల్లితెరపై నటిస్తున్న సమయంలోనూ తనకు వేధింపులు తప్పలేదని అందుకే పూర్తిగా నటనకు దూరంగా ఉండి కుటుంబంతో హాయిగా ఉంటున్నట్టు ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.