ప్రముఖ హీరోయిన్ పూర్ణ తన పిల్లాడిని ప్రపంచానికి పరిచయం చేసింది. తాజాగా ఓ పెళ్లి వేడుకకు హాజరైన పూర్ణ తన భర్త ఆసిఫ్ అలీతో పాటు కుమారుడితో కలిసి ఈ పెళ్లి వేడుకలో సందడి చేసింది. అనంతరం పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
శ్రీ మహాలక్ష్మి సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టింది మలయాళీ అయిన పూర్ణ. ఆ తర్వాత సీమ టపాకాయ్, అవును, అవును 2, జయమ్ము నిశ్చయమ్మురా, రాజుగారి గది, అఖండ తదితర హిట్ సినిమాల్లో నటించింది. చివరగా నేచురల్ స్టార్ నాని మూవీ ‘దసరా’ లో నటించింది.
స్టార్ సెలబ్రిటీలు తమ పిల్లల విషయంలో చాలా గోప్యత పాటిస్తున్నారు. తమ పిల్లల ఫొటోలు, వీడియోస్ మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ ఎక్కడా కనిపించకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఏదైనా ఫంక్షన్లకు వచ్చినప్పుడు తమ పిల్లల ఫొటోస్ తీయకుండా అడ్డుకుంటుంటారు.
పెళ్లి విషయంలో ఎంతో గోప్యత పాటించిన పూర్ణ తన కొడుకు విషయంలో వెంటనే బయటపెట్టేసింది. దుబాయికి చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని సీక్రెట్‌గా పెళ్లి చేసుకుంది. కొన్నాళ్ల తర్వాత 2022 జూన్ 12న దుబాయిలోనే తాను పెళ్లిచేసుకున్నట్టు చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.
ఈ ఏడాది ఏప్రిల్‌లో హమ్దాన్ అసిఫ్ అలీ అనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. గర్భం దాల్చినప్పుడు సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు, సన్నిహితుల సమక్షంలో సీమంతం గ్రాండ్‌గా జరుపుకొంది. ఆ ఫొటోలను కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది.
https://www.instagram.com/reel/Cvfkmk4hNc3/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==
https://www.instagram.com/reel/CvUxXmOx33y/?utm_source=ig_web_copy_link&igshid=MzRlODBiNWFlZA==