హిందీ టీవీ నటి ప్రీతికా చౌహాన్ (30) డ్రగ్స్ వినియోగం కేసులో అరెస్ట్ అయింది. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు శనివారం ఆమెతో పాటు మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు. శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో వర్సోవా, మచ్చిమార్ కాలనీలోని ఓ ఇంట్లో అధికారులు సోదాలు నిర్వహించారు. గంజాయిని కొనుగోలు చేస్తున్న ప్రీతికా చౌహాన్, విక్రేత ఫైజల్లను అరెస్ట్ చేశారు. వారి వద్దనుంచి 99 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈ ఆదివారం వారిద్దరిని కోర్టులో హాజరు పరిచారు. వీరికి నవంబర్ 8వ తేదీ వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. దేవోకి దేవ్ మహదేవ్, సంకట్ మోచన్ మహాబలి హనుమాన్, మా వైష్టోదేవీ, సంతోషీ దేవీ, సీఐడీ, సావ్ధాన్ ఇండియా వంటి పలు హిందీ సీరియళ్లలో ఆమె నటించారు.