నటి ప్రగతి సోషల్ మీడియా ద్వారా ఆనందం వ్యక్తం చేసింది. ఆమె ప్రముఖ బ్రిటన్ జర్నలిస్టు కిరణ్ రాయ్ `400 మంది స్ఫూర్తివంతుల` జాబితాలో చోటు సంపాదించడంతో ఆమె సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటికే టాలీవుడ్ నుండి తెలుగు బుల్లితెర ప్రముఖ యాంకర్లు ప్రదీప్ మాచిరాజు, రష్మీ గౌతమ్ ఈ అరుదైన ఘనతను సాధించారు. ఆసియాలోని భారత్, పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ దేశాల్లోని పలువురు ప్రముఖులను ఈ జాబితాలో ఎంపిక చేశారు. ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్ ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. అలాగే సోనూ నిగమ్, రహత్ ఫతే అలీ, అద్నాన్ సమీ, జాకీర్ హుస్సేన్ వంటి ప్రముఖులు ఈ జాబితాలో ఉన్నారు. ఇన్‌స్టాలో తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ప్రగతి వీడియో రిలీజ్ చేశారు. ఈ జాబితాలో మొత్తం 230 మంది భారతీయ ప్రముఖులు ఉన్నారు. ఇదే జాబితాలో తను కూడా ఉన్నట్లు నటి హరితేజ పేర్కొన్నారు.