హీరోయిన్ పూర్ణ త్వరలో పెళ్లి పీటలెక్కబోతోంది. దుబాయ్‌కు చెందిన వ్యాపారవేత్త షానిద్ అసిఫ్ అలీని పెళ్లాడబోతోంది. ఇటీవలే గుట్టుచప్పుడు కాకుండా ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకుంది. తాజాగా ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది. ‘కుటుంబ సభ్యుల ఆశీర్వాదంతో జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాను’ అంటూ.. కాబోయే భర్తతో దిగిన ఫొటోను షేర్ చేసింది.
దీంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. కాగా ఆమె భర్త షానిద్ బడా వ్యాపారవేత్త. జేబీఎస్ గ్రూప్ ఆఫ్ కంపెనీలను స్థాపించిన ఆయన వాటికి సీఈవోగా వ్యవహరిస్తున్నాడు. పూర్ణ సినిమాల విషయానికి వస్తే ఆమె ఇటీవల బ్యాక్‌డోర్, అఖండ వంటి చిత్రాలతో మెప్పించింది.
With the blessings of family stepping to my next part of life❤️💍 and now it’s official ❤️ pic.twitter.com/v7Qo04t3Ws
— Purnaa (@shamna_kkasim) June 1, 2022