హాట్ బ్యూటీ నమిత తమిళ పరిశ్రమలో తిరుగులేని తారగా మెప్పించింది. తాజాగా ‘బొట్టు’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమా తర్వాత కోలీవుడలో ఎక్కువగా అవకాశాలు వస్తాయని అనుకుంది. కానీ తనకు నచ్చిన స్థాయిలో సినిమా అవకాశాలు రాలేదని సమాచారం. అయితే మలయాళంలో మాత్రం ఓ సినిమాలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఇటీవల ఓ మూవీ ఆడియో ఫంక్షన్లో ఈ అమ్మడు ముఖ్య అతిథిగా హాజరైయింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘నాకు రొమాన్స్ చిత్రాలంటే చాలా ఇష్టం. ఎక్కువగా చూసేదాన్ని. రొమాన్స్ చిత్రాలు చూసీ.. చూసీ.. బోర్ కొట్టేసింది. ఇప్పుడెందుకో ఆ సినిమాలు నచ్చడం లేదు. కామెడీ సినిమాలే చూడాలనిపిస్తోంది. ఎక్కువగా హాస్య చిత్రాలు చూస్తున్నానని’ పేర్కొన్నారు.