టాలీవుడ్లో .. సొంతం, జెమిని, ‘బిల్లా’, సింహా వంటి చిత్రాలతో ప్రేక్షకులకు దగ్గన ముద్దుగుమ్మ నమిత. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న నమిత త్వరలో తల్లి కాబోతోంది. తన బర్త్‌డే రోజు (మే 10) ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడించింది. భర్తతో కలిసి బేబీ బంప్‌తో దిగిన పలు ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
తాజాగా నమితకు సీమంతం జరిగింది. సాంప్రదాయ పద్ధతిలో కుటుంబ సభ్యులు ఆమెకు సీమంతం వేడుక నిర్వహించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక 2017లో వ్యాపారవేత్త వీరేంద్రతో నమిత వివాహం జరగ్గా 41 ఏళ్ల వయసులో ఆమె తల్లి కాబోతుండటం గమనార్హం.