HomeTelugu Trending48 ఏళ్ల వయస్సులో నగ్మాకి పెళ్లి ఆలోచన!

48 ఏళ్ల వయస్సులో నగ్మాకి పెళ్లి ఆలోచన!

actress Nagma comments on h

తెలుగు ప్రేక్షకులకు నటి నగ్మా సుపరిచితమే. దక్షిణాదిన ఆమె చాలా కాలం పాటు స్టార్‌ హీరోయిన్‌గా కొనసాగింది. టాలీవుడ్ కు ఆమె దూరమై దాదాపు 20 ఏళ్లు అవుతోంది. ఆ తర్వాత ఇతర భాషల్లో కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ 2008లో నటనకు పూర్తిగా దూరమయింది. అనంతరం రాజకీయ రంగంలోకి ప్రవేశించింది.

48 ఏళ్ల వయసు వచ్చినా నగ్మా ఇంత వరకు పెళ్లి చేసుకోలేదు. టీమిండియా మాజీ కెప్టెన్ గంగూలీతో ఆమె ప్రేమాయణం అప్పట్లో సంచలనం రేపింది. పెళ్లి అయిన సినీ నటులు శరత్ కుమార్, మనోజ్ తివారీ, రవి కిషన్ లతో కూడా ఆమెకు అఫైర్ ఉందనే ప్రచారం పెద్ద ఎత్తున సాగింది.

తాజాగా తన పెళ్లి గురించి నగ్మా స్పందించింది. పెళ్లి చేసుకోకూడదనే ఆలోచన తనకు ఎప్పుడూ లేదని ఆమె తెలిపింది. తనకంటూ ఒక తోడు ఉండాలని, పిల్లలు ఉండాలనే ఆశ తనకు కూడా ఉందని చెప్పింది. పెళ్లి ద్వారా ఒక కుటుంబాన్ని ఏర్పరుచుకోవాలనే ఆలోచన తనకు ఉందని… కాలం కలిసొస్తే తన పెళ్లి జరుగుతుందేమో చూద్దామని తెలిపింది. పెళ్లి అయితే మాత్రం తాను చాలా సంతోషిస్తానని చెప్పింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu