తమిళనటి మీరామిథున్ తరచూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో నిలుస్తుంది. తాజాగా ఈ బ్యూటీ మరో వివాదం రేపింది. కోలీవుడ్ అతి పెద్ద రియాల్టీ షో బిగ్ బాస్ ను అడ్డుకుంటానని అంటుంది మీరామిథున్. అవసరమైతే కోర్టుకు వెళ్లి స్టే తీసుకుని అయినా వస్తానని హెచ్చరించి కలకలం రేపింది. తనకు సంబందించిన ఓ వీడియో కమల్ దగ్గర ఉందని అది చూపించి తనకు అవకాశాలు రాకుండా చేస్తున్నారని ఆరోపించింది.గతంలో బిగ్ బాస్ 3 లో మీరా పాల్గొంది. ఆ షోలో మరో కంటెస్టెంట్ తన నడుమును గట్టిగా పట్టేసుకుని గిల్లాడని సంచలన ఆరోపణలు చేయగా, ఆ వారం చివరలో కమలహాసన్, మీరా మిథున్ అబద్ధాలు చెబుతున్నదంటూ అసలు వీడియోను కమల్ ప్రేక్షకులకు చూపగా కంగుతిన్న ఆమె, అప్పటి నుంచి కమల్ పై తన ఆగ్రహాన్నివెళ్లగక్కుతూనే ఉంది. అయితే మీరా ఆరోపణలను కమల్ కానీ బిగ్ బాస్ నిర్వాహకులు గాని ఎవ్వరూ పట్టించుకోవడంలేదు.
Idhula Ivaruku arasiyal aasa vera @ikamalhaasan So only your family & generation will dominate the society , killing talents, youth future, gang up of upper caste Brahmins, make tamilians suffer. Well remember history,Brahmins were jus workers in tamilian ruled kingdom.@mkstalin
— Meera Mitun (@meera_mitun) September 9, 2020