ప్రముఖ నటి మీనా భర్త సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ విద్యాసాగర్(48) హఠాన్మరణం చెందారు. ఆయన కొద్దిరోజులుగా తీవ్రమైన శ్వాసకోస సమస్యతో బాధపడుతున్నారు. జనవరిలో మీనా కుటుంబం మొత్తం కరోనా బారిన పడింది. కోవిడ్ తగ్గినా ఆరోగ్య సమస్య మీనా భర్తను వేధించింది. కొద్దిరోజులుగా ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్చారు. ఆస్పత్రిలోనే ఆయన తుదిశ్వాస విడిచారు.
మీనా భర్త విద్యాసాగర్ మృతిపట్ల సినీ ప్రముఖులు, నెటిజన్లు సంతాపం వ్యక్తం చేశారు. బెంగళూరుకు చెందిన విద్యాసాగర్‌తో మీనా 2009లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరిదీ పెద్దలు కుదిర్చిన వివాహం. కెరీర్‌లోరాణిస్తుండగానే మీనా వివాహం చేసుకున్నారు. వీరిద్దరికి నైనికా అనే కుమార్తె ఉంది. దళపతి విజయ్ హీరోగా వచ్చిన తేరీ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించింది.