ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా కొన్నాళ్ళు రాణించిన తరువాత పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుంటారు. హీరోయిన్లు అందరికి పెద్ద పెద్ద సినిమాల్లో అవకాశాలు వస్తాయా అంటే రావని చెప్పాలి. అదృష్టం ఉంటె పెద్ద సినిమాలు వస్తాయి లేదంటే చిన్న సినిమాలతో సరిపెట్టుకోవాలి. కొన్ని సినిమాలు చేసిన తరువాత హీరోయిన్లు పెళ్లి చేసుకొని సెటిల్ అవుతుంటారు.
ఇటీవలే అర్చన పెళ్లి పీటలెక్కింది. ఈ బాటలోనే మరో హీరోయిన్ మనాలి రాధోడ్ కూడా పెళ్లి చేసుకుంది. మనాలి రాధోడ్ తెలుగులో వంశీ దర్శకత్వంలో వచ్చిన ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్, గ్రీన్ సిగ్నల్, ఓస్త్రీ రేపురా వంటి సినిమాలు చేసింది. అటు కోలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు చేసింది. అయినప్పటికీ తగిన గుర్తింపు రాకపోవడంతో.. పెళ్లి చేసుకొని సెటిల్ కావాలని అనుకుంది. రవి విజ్జిత్ అనే బిజినెస్‌మెన్ ను వివాహం చేసుకుంది. సైలెంట్ గా హడావుడి లేకుండా జరిగిన ఈ వివాహానికి కొంతమంది టాలీవుడ్ సెలెబ్రిటీలు హాజరయ్యారు.