HomeTelugu Big Storiesకొత్త జీవితం మొదలైంది.. నటి మాధవీలత పెళ్లి!

కొత్త జీవితం మొదలైంది.. నటి మాధవీలత పెళ్లి!

6 4టాలీవుడ్‌లో ‘నచ్చావులే’ సినిమా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది నటి మాధవీలత. దీనికంటే ముందుగానే మహేష్‌ బాబు హీరోగా నటించిన ‘అతిథి’ సినిమాలో నటించింది నటించింది. ఆ తరువాత ఆమెకు అవకాశాలు కూడా పెద్దగా రాకపోవడంతో ఇక సినిమాలకు స్వస్తి చెప్పి రాజకీయాల వైపు వెళ్లిపోయింది. మొదట టీడీపీలో చేరింది. ఆ తరవాత బీజేపీకి మారారు. గత ఎన్నికల్లో గుంటూరు వెస్ట్ నుంచి పోటీచేసి ఓడిపోయింది. కాగా అప్పటికే వివాదాస్పద వ్యాఖ్యలతో ఆమె ఫుల్ పాపులర్ అయిపోయారు.

రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తరవాత ఈ బ్యూటీ తన పాపులారిటీ మరింత పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదంపై సోషల్ మీడియాలో మాట్లాడుతూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. నాయకురాలు కూడా కావడంతో సామాజిక అంశాలపై సోషల్ మీడియాలో తన అభిప్రాయాలను తెలియజేస్తుంది. అయితే, తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి మాధవీలత ఒక పోస్ట్ చేసింది. ‘‘చాలా నెలల తరవాత నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. కొత్త జీవితం మొదలైంది. మిరాకిల్ జరిగింది. నేను ఎప్పుడూ అద్భుతాలను నమ్ముతాను. చాలా చాలా చాలా సంతోషంగా ఉన్నాను. త్వరలోనే ప్రకటన చేస్తాను’’ అని మాధవీలత తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో పేర్కొన్నారు. ప్రస్తుతం మాధవీలతకు 31 సంవత్సరాలు. రాజకీయ నాయకురాలిగా బిజీగా ఉన్నారు. ఇక ఆమె లైఫ్‌లో జరిగిన మిరాకిల్ ఏముంటుంది? పెళ్లి తప్ప! కొత్త జీవితం కూడా ప్రారంభమైంది అంటూ పోస్ట్‌ చేసింది.

6aకాబట్టి, ఇది కచ్చితంగా పెళ్లి గురించేనని అంటున్నారు. అయితే, కొంత మంది ప్రేమ గురించి కూడా కావచ్చు కదా అని అంటున్నారు. ఈ విషయంపై స్పష్టత రావాలంటే త్వరలో ఆమె చేయబోయే పోస్ట్‌ కోసం వేచి చూడాల్సిందే. ఇదిలా ఉంటే, మాధవీలత చేసిన పోస్ట్ విషయంపై కొంత మంది సినిమా ప్రేమికులు ఆమెపై సెటైర్లు వేస్తున్నారు. ఎందుకంటే, లాక్‌డౌన్ సమయంలో దిల్ రాజు, నిఖిల్ పెళ్లిళ్లు చేసుకోవడంపై పరోక్షంగా మాధవీలత కామెంట్లు చేసింది. ‘నాలుగు రోజులు ఆగలేరా..? ఏమిటర్రా ఈ తొందర..? కాస్త ఆగితే నిజస్వరూపాలు బయటపడిపోతాయా..?’ అంటూ పోస్ట్ చేసింది. వారిని అన్న ఈమెకు ఇప్పుడెందుకు అంత తొందర? ఆగలేకపోతున్నారా? అని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.

 

Recent Articles English

Gallery

Recent Articles Telugu