HomeTelugu Big Storiesమూసుకుని కూర్చో.. కత్తి మహేష్‌పై మాధవి లత ఫైర్‌

మూసుకుని కూర్చో.. కత్తి మహేష్‌పై మాధవి లత ఫైర్‌

14a
కత్తి మహేష్‌ తరచూ వివాదస్పద వ్యాఖ్యల చేస్తుంటాడు. ఒకప్పుడు పవన్ కళ్యాణ్‌ను టార్గెట్ చేసి బాగా తిట్లు తిన్న ఈయన ఇప్పుడు ఏకంగా హిందువుల మనోభావాలను టార్గెట్ చేసాడు. తాజాగా రాముడిపై ఈయన చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనం రేపుతున్నాయి. దొరికితే చంపేస్తామంటూ హిందూ సంఘాలు ఈయనకు వార్నింగ్ ఇస్తున్నాయి. శ్రీ రాముడిపై సంచలన వ్యాఖ్యలు చేసాడు. రాముడికి ఇష్టమైన వంటకం జింక మాంసం.. నెమలి తొడ అని.. సీత, రాముడిని జింకను తెమ్మన్నది తినడానికే అంటూ కత్తి మహేష్ కామెంట్ చేసాడు. ఇది విన్న తర్వాత హిందు సంఘాలు ఒక్కసారిగా మండిపడ్డాయి. ఇప్పుడు బిజేపీ నేత, హీరోయిన్ మాధవి లత కూడా కత్తి మహేష్‌కు వార్నింగ్ ఇచ్చింది.

ఇప్పటికే మహేష్‌ పై నాంపల్లి పీఎస్‌లో కేసు నమోదైంది. దాంతో పాటు రాష్ట్రంలోని పలు పోలీసు స్టేషన్లలో కూడా కత్తి మహేష్‌పై ఫిర్యాదులు చేశారు హిందూ సంఘాల నాయకులు. ఆయన్ని వదిలేది లేదంటున్నారు. ఇప్పుడు మాధవి లత మాట్లాడుతూ ఒకప్పుడు ఈ మహానుభావుడు పవన్ కళ్యాణ్‌ను తిట్టి ఫేమస్ అయ్యాడు.. ఆ తర్వాత రామాయణంపై ఇష్టానుసారం మాట్లాడి ఏకంగా నగరం నుంచి బహిష్కరించబడ్డాడు. ఇప్పుడు మళ్లీ వచ్చి బుద్ధి మార్చుకోకుండా శ్రీరాముడిపై కామెంట్స్ చేస్తున్నాడు అంటూ మండిపడింది. సీతమ్మ జింకను తినిడానికి రాముడ్ని అడిగిందని.. అంతపురంలో రాముడు సుఖించే వాడని.. ఆయన ఏక పత్నీవ్రతుడు కాదని.. మాంసాహారం తినేవాడని ఏది పడితే అది నోటికొచ్చినట్టు వాగుతున్నాడంటూ ఫైర్ అయింది.

14 6

అతను బాగా చదువుకున్నాడు.. చాలా నాలెడ్జ్ ఉన్నవాడే.. కాని.. మనం చదువుకున్న చదువు ఏం నేర్పుతుందని ప్రశ్నిస్తుంది.. ఓ మనిషి నీతిగా ఎలా బతకాలి.. అన్నదానిపైనే జీవితం ఆధారపడి ఉంటుంది కదా.. ఆ కనీస జ్ఞానం కూడా ఆ మనిషికి లేదంటూ కత్తిపై ఓ రేంజ్‌లో విరుచుకుపడింది మాధవి లత. దేవుళ్లుపై, రాజులపై ఎన్ని కథలున్నా.. శ్రీకృష్ణుడు అంతమందిని పెళ్లి చేసుకున్నా కూడా ఎక్కడా మనకు కూడా అదే ఫాలో కావాలని చెప్పలేదు.. ప్రతిదానికి ఒక నీతి ఉంటుందని అర్థం చేసుకోని చదువు ఎందుకు… తరతరాలకు ఉపయోగపడటానికి రాసే కథలను కూడా మనం ఇలా అనేస్తే ఇంకెందుకు అంటుంది మాధవి.

రామాయణంలో చెప్పారని వాళ్లు ఇలా చేశారు.. వీళ్లు ఇలా చేశారు.. రాముడు వందమందితో తిరిగాడు.. సీతమ్మ జింకను వేటాడుకుని తినేసిందని ఈయన చెప్తున్నాడు.. ఇందులో మంచి ఎక్కడ కనిపిస్తుందని ప్రశ్నిస్తుంది మాధవి. రాముడు మంచివాడు అంటే మైండ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది.. అదే సమయంలో రావణుడు రాక్షసుడు అంటే మనకు తెలియని ఫీలింగ్ వస్తుంది.. ఎందుకంటే అది విలనిజం కాబట్టి.. రాముడు హీరోయిజం కాబట్టి అంతే తేడా. చిన్న సాయం చేసినా దేవుడే అవుతాడని గుర్తించుకోవాలి.. రాముడు అయోధ్యను పరిపాలించినప్పుడు ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారు కాబట్టే ఆయన్న దేవుడు అని మాధవిలత అంది. నమ్మకం లేకపోతే మూసుకుని ఉండాలి కానీ కోట్ల మంది మనోభావాలను దెబ్బతీసే హక్కు ఎవరిచ్చారు అంటూ కత్తి మహేష్‌పై మండిపడింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu