HomeTelugu NewsLaya: కోడి రామకృష్ణతో చేసిన ఆ సినిమా నా కెరీయర్‌లోనే వరెస్ట్‌!

Laya: కోడి రామకృష్ణతో చేసిన ఆ సినిమా నా కెరీయర్‌లోనే వరెస్ట్‌!

Laya

Laya: అందాల నటి లయ గురించి ప్రత్యేకించి చెప్పానవసరం లేదు. హోమ్లీ హీరోయిన్ గా గుర్తింపు ఈ అమ్మడు స్వయంవరం, మనోహారం, పెళ్ళాంతో పనేంటి, విజయేంద్ర వర్మ లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. ప్రేమించు సినిమాలో.. అంధురాలిగా ఆమె నటనకు ప్రశంసలు వచ్చాయి. 2001 లో విడుదలైన ఈ సినిమా ఉత్తమ చిత్రంగా బంగారు నందిని గెల్చుకుంది.

ఆ తర్వాత లయ.. గణేష్ గోర్తీ అనే డాక్టర్ ని వివాహం చేసుకుని అమెరికాలో సెటిల్ అయింది. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న లయ సోషల్‌ మీడియా చాలా యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ తన ఫ్రెండ్స్‌తో వీడియోలు చేస్తూ.. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తుంది.

ఇక త్వరలో లయ టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతోంది. యంగ్ హీరో నితిన్, వకీల్ సాబ్ డైరెక్టర్ వేణు శ్రీరామ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం తమ్ముడు. ఈ చిత్రంలో లయ నితిన్ అక్క పాత్రలో నటిస్తోంది. లయ పాత్ర చుట్టే ఈ చిత్ర కథ ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీంతో లయ వరుసగా ఇంటర్వ్యూలతో బిజీగా ఉంది. తాజాగా ఆమె అలీ హోస్ట్ గా చేస్తున్న అలీతో సరదాగా అనే షోకి అతిథిగా హాజరైంది. ఈ షో ప్రోమో వైరల్ గా మారింది. ఎప్పటిలాగే అలీ సరదాగా జోకులు వేస్తూ.. కొన్ని సీరియస్ ప్రశ్నలు కూడా అడిగాడు.

laya Laya,Swayamvaram,Manoharam,Thammudu

తన అమెరికా జీవితం గురించి వచ్చిన రూమర్స్ పై లయ ఈ ఇంటర్వ్యూలో బాగా సీరియస్ అయింది. అదే విధంగా అలీతో కలసి నటించిన చిత్రాలని కూడా లయ గుర్తుచేసుకుంది. తన సినీ కెరీర్ లో కొన్ని తప్పులు చేసినట్లు కూడా లయ అంగీకరించింది. అందులో మొదటి తప్పు.. స్వయంవరం లాంటి సూపర్ హిట్ తర్వాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో మా బాలాజీ అనే చిత్రంలో నటించడమే అని సంచలన వ్యాఖ్యలు చేసింది.

కోడి రామ కృష్ణ గారు స్టార్ డైరెక్టర్ కావడంతో ఆయన అడిగితే నో చెప్ప కూడదు అనే ఒకే ఒక్క కారణంతో ఆ సినిమా చేశాను. మంచి హిట్ సినిమా తర్వాత తాను నటించిన చెత్త సినిమా అది అని లయ పేర్కొంది. ఆ తర్వాత లయ జీవితంలో జరిగిన ఒక సంచలన సంఘటన గురించి అలీ ప్రశ్నించగా.. ఎయిర్ పోర్ట్ లో పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్న డైరెక్టర్ ఒకరు లయపై దాడికి ప్రయత్నించాడట.

బేగం పేట ఎయిర్ పోర్ట్ లో ఉండగా పార్కింగ్ ప్లేస్ లో ఆయా డైరెక్టర్ నన్ను ఆపాడు. నువ్వు ఇక్కడి నుంచి ఎలా వెళతావో చూస్తా అని అన్నాడు. ఫాలో అయ్యాడు. నేను ఒక్కటే సమాధానం ఇచ్చా. ఇక్కడ ఎవరూ లేరు.. నేను ఒంటరిగా ఉన్నా. మీరు చంపుతా అంటే వచ్చి చంపండి చూద్దాం అంటూ లయ ఎదురుతిరిగిందట.

Recent Articles English

Gallery

Recent Articles Telugu