పూర్వకాలం నుంచి నిన్నటి సుశాంత్ సింగ్ రాజ్ పుత్ వరకు డిప్రెషన్ కారణంగా పలువురు సెలెబ్రిటిలు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డిప్రెషన్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, ఆత్మహత్యపై సీనియర్ నటి కుష్బూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఒకప్పుడు తాను కూడా ఆత్మహత్య చేసుకుందామని అనుకున్నానని, అప్పట్లో చాలా డిప్రెషన్‌కు గురైనట్టుగా కుష్బూ తెలిపింది. జీవితం అంధకారంగా మారినప్పుడు శాశ్వతంగా నిద్రలోకి జారుకోవాలని అనుకోవడం సహజమే అని, కానీ, జీవితంలో ఎదగాలి అనే ఆలోచన తిరిగి ఉద్బవించినప్పుడు ఎంత కష్టమైనా నిలబడి జీవితంలో తిరిగి గెలవగలుగుతామని కుష్బూ పేర్కొన్నారు. జీవితంలో ఎదగడం మొదలుపెట్టాక తిరిగి అలాంటి ఆలోచనలు రాలేదని అన్నారు.
Everyone goes through upheaval n depression. I would be lying if I say I haven’t. I did and wanted to end all. But I fought the demons in my head bcoz I wanted to prove I am stronger than them. Stronger than those who wanted to fail me. Stronger than those who waited for my end.
— KhushbuSundar ❤️ (@khushsundar) June 15, 2020