HomeTelugu Trendingహీరో కొడుకు వేధింపులు.. స్పందించిన కృతిశెట్టి

హీరో కొడుకు వేధింపులు.. స్పందించిన కృతిశెట్టి

Kritishetti rumours

ఉప్పెన చిత్రంతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది కృతిశెట్టి. తొలి సినిమాతో బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసింది. కొద్దికాలంలోనే ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించింది. కృతిశెట్టికి సంబంధించి ఓ వార్త నెట్టింట హల్చల్ చేస్తోంది.

ఓ స్టార్ హీరో కొడుకు తనను స్నేహం పేరిట వేధిస్తున్నాడంటూ ఈ విషయాన్ని కృతిశెట్టి ఓ ఇంటర్వ్యూలో చెప్పిందంటూ కొద్ది రోజులుగా పలు కథనాలు హల్చల్ చేస్తున్నాయి. ఎక్కడికి వెళ్లినా తనను తోడు రమ్మంటూ వేధిస్తున్నాడని ఆరోపణలు చేసినట్టు ఆ కథనాల్లో పేర్కొన్నారు.

వీటిపై నటి కృతి శెట్టి స్పందిస్తూ ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని స్పష్టం చేసింది. తానెప్పుడూ అలా చెప్పలేదని కొట్టిపారేసింది. వదంతులను పట్టించుకోవద్దని అనుకున్నానని, కానీ తప్పుడు ప్రచారం తీవ్రస్థాయిలో జరుగుతున్నందున స్పందించక తప్పలేదని వివరణ ఇచ్చింది.

అవన్నీ ఆధారం లేని వార్తలని వాటిని ఎవరూ నమ్మొద్దని తెలిపింది. ఈ మేరకు కృతి శెట్టి ట్వీట్ చేశారు. దీంతో ఆ వార్తలకు ఫుల్‌స్టాప్ పడినట్లయింది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu