HomeTelugu Newsనాకు నేనే డిజైనర్‌నంటున్న కీర్తి సురేష్

నాకు నేనే డిజైనర్‌నంటున్న కీర్తి సురేష్

2 14

ఫ్యాషన్‌ డిజైనింగ్‌ చదివాను కదా అందుకే భిన్నమైన ప్రయోగాలు చేస్తుంటానంటోంది ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన ఇష్టాల గురించి చెప్పింది మహానటి హీరోయిన్ కీర్తి సురేష్. నాకు నేనే డిజైనర్‌ను.. ఇప్పుడు చీరనే కుర్తీపై, ప్యాంటుపై కట్టుకుంటున్నా. అలాగే ఒకసారి లేదా రెండు సార్లు కట్టిన దుస్తులను కొత్త లుక్‌ వచ్చేలా మారుస్తా. టాప్స్‌పై ష్రగ్‌ లేదా స్లీవ్‌లెస్‌పై కోటు వేసుకుంటా. తక్కువ పనితనం ఉండే తేలికైన జుబ్బాలపై మెడచుట్టూ వచ్చేలా స్కార్ఫ్‌ ప్రయత్నిస్తా. కొత్తగానూ ఉంటుంది… ఆకట్టుకునేలా కనిపిస్తుంది అంటోంది.

నేను రోజువారీ వేసుకునే పలాజో, జీన్స్‌లపై కాస్త వదులుగా ఉండే టాప్‌లకు ప్రాధాన్యం ఇస్తా. కాలాన్ని బట్టి అందరిలానే భిన్నమైన వస్త్రాల్ని ఎంచుకుంటా. అనార్కలీ, సల్వార్‌ దుస్తులను మాత్రం ప్రత్యేక సందర్భాల్లోనే బయటకు తీస్తా. నా వార్డ్‌రోబ్‌లో దాదాపుగా మూడొంతుల దుస్తులు క్యాజువల్సే. జెగ్గింగ్స్‌ పెద్దగా వాడను. జీన్స్‌లో అన్ని రంగులూ ఉంటాయి. సాయంత్రాలు, తీరిక సమయాల్లో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు క్యాజువల్స్‌నే ఎంచుకుంటా. అవి నాకు సౌకర్యంగా అనిపిస్తాయి. అయితే ఆ దుస్తుల్లోనే వైవిధ్యంగా ఉండే డిజైన్లకు ప్రాధాన్యం ఇస్తా. నా వార్డ్‌రోబ్‌లో చీరలకు చాలా తక్కువ స్థలం ఉంటుంది. ఎందుకంటే చాలా సింపుల్‌గా లేత వర్ణాల్లో మెత్తని వస్త్రంలా ఉండే చీరలకు మాత్రమే ఫిదా అవుతా.. చీర కట్టుకుంటే సౌకర్యంగా అనిపించాలి అటువంటి వాటికే ప్రాధాన్యం ఇస్తానంటున్న కీర్తి తనకు ఇష్టమైన రంగు ఆకుపచ్చ అని చెబుతోంది.

Recent Articles English

Gallery

Recent Articles Telugu