కరోనా మహమ్మారి ఎంతోమంది కుటుంబాల్లో విషాదాన్ని మిగిల్చింది. కాగా సీనియర్ నటి కవిత గత పది రోజుల క్రితమే కొడుకు సంజయ్ రూప్ మృతి చెందిన సంగతి తెలిసిందే. కుమారుడిని పోగట్టుకుని పుట్టెడు దుఖంలో ఉన్న కవితకు మరో కోలుకోలేని షాక్ తగిలింది. కవిత భర్త దశరథ్ రాజ్ కూడా మహమ్మారికి బలయ్యారు. కరోనా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఆయన తుదిశ్వాస విడిచాడు. గత కొన్ని రోజుల క్రితం కరోనా బారిన పడిన కవిత భర్త దశరథ రాజు ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో కన్నుమూశారు. దశరథ రాజు మరణవార్త తెలిసి సినీ ప్రముఖులు కవితను పరామర్శిస్తున్నారు.
11 ఏళ్ల వయసులో వెండితెరపై అడుగుపెట్టిన కవిత తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమాలు చేసి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గురింపు తెచ్చుకుంది. భాషతో సంబంధం లేకుండా సౌత్‌లో దాదాపు 350కు పైగా సినిమాల్లో ఆమె నటించింది. కొన్ని సినిమాల్లో మేజర్ రోల్స్ చేసి మూవీ విజయంలో భాగం పంచుకుంది.