హీరోయిన్ కల్యాణి ఇప్పుడు డైరెక్టర్గా మారింది. సొంత బ్యానర్లో ఓ సినిమాను రూపొందిస్తుంది. చేతన్ చీను ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. కాగా కేరళలో పుట్టి పెరిగిన కల్యాణి ‘శేషు’ సినిమాతో టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. ‘ఔను వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు’ చిత్రంతో క్రేజ్ సంపాదించుకున్న కల్యాణి పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంది.
ఆ తర్వాత నిర్మాతగానూ మారింది. ఇటీవలె నటిగా రీఎంట్రీ ఇచ్చింది. ఇప్పడు డైరెక్టర్గా పరిచయం కానుంది. సొంత బ్యానర్లో ఈ చిత్రాన్ని రూపొందిస్తుంది. తెలుగు, తమిళ, భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.