టాలీవుడ్లోకి కాజల్ లక్ష్మి కళ్యాణం సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత వరసగా భారీ హిట్ సినిమాలు చేసి టాప్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పటికే ఇండస్ట్రీలోకి వచ్చి 12 ఏళ్ళు దాటింది. ఇప్పటికి సినిమా అవకాశాలు దక్కించుకుంటోంది ఈ ముద్దుగుమ్మ. కాజల్ కు వరసగా అవకాశాలు వస్తున్నా.. సినిమాలు పరాజయం అవుతుండటం ఆమెకు మైనస్ అవుతున్నది. తెలుగులో కొరటాల శివ.. మెగాసార్ చిరంజీవి కాంబినేషన్లో రాబోతున్న 152 వ సినిమాలో హీరోయిన్ గా చేస్తున్నట్టు సమాచారం.
ఇదిలా ఉంటె, ఇటీవలే తమిళంలో విడుదలైన కోమలి సినిమా హిట్టైంది. ఇది కాజల్‌కు ఊరటనిచ్చే అంశం అని చెప్పాలి. తెలుగులో రణరంగం ఫెయిల్ అయినా.. తమిళంలోచేసిన కోమలి హిట్ అయ్యింది. కాజల్ నటించిన క్వీన్ రీమేక్ ప్యారిస్ ప్యారిస్ రిలీజ్ కు సిద్ధం అవుతున్నది. దీంతో పాటు అటు శంకర్ భారతీయుడు 2 లో కూడా కాజల్ నటిస్తోంది. ఇప్పుడు మరోసారి బాలీవుడ్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నది కాజల్. హిందీలో ముంబై సాగా అనే సినిమాలో నటిస్తోంది. జాన్ అబ్రహాం, ఇమ్రాన్ హష్మీలు హీరోలు. ఈ చిత్రంలో కాజల్ మూడు వైవిధ్యమైన గెటప్స్ లో కనిపిస్తున్నట్టు సమాచారం. అందులో ఒకటి 17 సంవత్సరాల యువతి పాత్ర. మరి ఈ పాత్రలో కాజల్ ఎలా ఉంటుందో అని అందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.